కుజుడు శక్తివంతమైన గ్రహం. రాహువు క్రూరమైన పాపగ్రహం. కుజుడు, రాహువు కలయిక ఎంతో ప్రమాదకరం. మే 18 నుంచి కుజుడు, రాహువు షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి ప్రమాదకరంగా మారింది. దీనితో ఈ మూడు రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి.
క్రూరమైన, పాపభరితమైన రాహువు ఎప్పుడూ తిరోగమనం దిశలో కదులుతాడు. ప్రతి ఏడాదిన్నరకి ఒకసారి రాశి చక్రాన్ని మారుస్తాడు. రాహువు 2025లో రాశిని మారుస్తున్నాడు. మే 18న రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కుజుడు కర్కాటకంలో ఉంటాడు. రాహువు, కుజుడి షడాష్టక యోగం వలన మే 18 నుంచి జూన్ 7 వరకు 20 రోజులు పాటు మూడు రాశుల వారికి కష్టంగా ఉంటుంది.
ఈ షడాష్టక యోగంతో సింహ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కెరీర్ లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుని సహనంతో వ్యవహరించాలి.
ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయంలో కష్టతరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. పని ప్రదేశంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావచ్చు. బిజినెస్ లో కూడా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.
మీన రాశి వారికి రాహువు కుజుడి సడష్టక యోగం ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టం రావచ్చు. పెద్దపెద్ద ఇన్వెస్ట్మెంట్లు కి దూరంగా ఉంటే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.