శ్రీవైభవలక్ష్మి యొక్క యదార్థ స్వరూపం ఐశ్వర్యమే కదా! ఆ ఐశ్వర్యానికి గీటురాయి బంగారం. కావున పూజలో ఏదైనా ఒక బంగారు వస్తువును కానీ నాణేన్ని కానీ వుంచి పూజించాలి అనిబ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. బంగారం లేనివాళ్ళు వెండి వస్తువును కానీ నాణేన్ని కానీ పూజించవచ్చును.
అది కూడా అందుబాటులో లేనివాళ్ళు వారి దేశంలో చెలామణిలో వున్న ధనం యొక్క ప్రమాణ నాణేన్ని (మన దేశంలో రూపాయి కాసు) అయినా పూజించాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అమ్మవారి పూజలో కలశం చాలా ప్రధానం, ఈ కలశం రెండు రకాలు.
ఒకచిన్న కొబ్బరిబొండాం లేదా పెద్ద కొబ్బరికాయ, రాగి, వెండి, బంగారు పాత్రలో నీళ్ళు పోసి గంధ పుష్పాక్షతలతో అర్చించి, చుట్టూరా కుంకుమ, గంధాలతో అలంకరించాలి. కలశంలో కొనలు బయటకొచ్చేలా తమలపాకులు కానీ, మామిడాకులు కానీ వుంచాలి. పూజించదలచిన బంగారు/వెండి/రూపాయి నాణేన్ని అందులో వేసి తర్వాత కొబ్బరికాయను తిరగేసి మూతపెట్టి ఆ కాయ ముచ్చికకు ఎర్ర రవికెల గుడ్డను తొడగాలి.
అంతా పైమాదిరే. ఎటొచ్చి బంగారాన్ని కలశంలో వేయకూడదు. కలశాన్ని మామిడాకులు, తమలపాకులతో అలంకరించాక దాని మీద ఒకచిన్న పాత్ర నుంచి, అందులో కాసిని పాలు పోసి బంగారు వస్తువును అందులో వుంచి పూజించాలి. పూజానంతరం తీసి మళ్ళీ వాడుకోవచ్చును. ఈరెండు విధానాల్లోను ఎవరి ఆనవాయితీని బట్టి, శక్తిని బట్టి వారు కలశారాధనం చేయాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ముఖ్యంగా ఈ పూజలో ముందుగా శ్రీలక్ష్మీగణపతిని (పసుపు గణపతి), అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శ్రీచక్రాన్ని, ఉద్గార యంత్రాన్ని, అమ్మవారి ఎనిమిది స్వరూపాలైన అష్టలక్ష్మీ మూర్తుల్నీ లాంఛనంగా ఆరాధించిన తర్వాతే వైభవలక్ష్మిని పూజించాలి.
వడపప్పు, పానకాలతో పాటు తప్పనిసరిగా ఒక తీపి వస్తువుని కూడా నివేదించాలి. రాత్రి భోజనం చేసేవారు భోజన పదార్థాలను కూడా మహానివేదనగా సమర్పించాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ పూజలో సాధ్యమైనన్ని ఎర్రపుష్పాలను, ఎర్రటి అక్షతలను తప్పనిసరిగా వాడాలి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు -9494981000