Puja Rules: వాసన చూసిన పూలతో ఎందుకు పూజ చేయకూడదు? భగవంతుడుని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 3 తప్పక తెలుసుకోండి-puja rules to be followed and never smell flowers and pray with those check these and do not do these mistakes at all ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Puja Rules: వాసన చూసిన పూలతో ఎందుకు పూజ చేయకూడదు? భగవంతుడుని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 3 తప్పక తెలుసుకోండి

Puja Rules: వాసన చూసిన పూలతో ఎందుకు పూజ చేయకూడదు? భగవంతుడుని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 3 తప్పక తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Feb 03, 2025 07:00 AM IST

Puja Rules: ప్రతీ పూజకి కూడా పూలు చాలా ముఖ్యమైనవి. పూజకు ఎలాంటి పూలను వాడాలనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే, పూలను పూజకి వాడేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి, ఎందుకు వాసన చూసిన పూలను దేవుడికి సమర్పించకూడదు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

Puja Rules: వాసన చూసిన పూలతో ఎందుకు పూజ చేయకూడదు
Puja Rules: వాసన చూసిన పూలతో ఎందుకు పూజ చేయకూడదు

భగవంతుని ఆరాధించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండొచ్చు. ప్రతీ రోజూ కూడా ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం మంచిది. అలా దీపారాధన చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. పూజ చేసేటప్పుడు మనం కొన్ని పూజ సామాగ్రిని సిద్ధం చేసుకుంటూ ఉంటాం.

సంబంధిత ఫోటోలు

ప్రతీ పూజకి కూడా పూలు చాలా ముఖ్యమైనవి. పూజకు ఎలాంటి పూలను వాడాలనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే, పూలను పూజకి వాడేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి, ఎందుకు వాసన చూసిన పూలను దేవుడికి సమర్పించకూడదు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

పూలతో భగవాడిని ప్రసన్నం చేసుకోవచ్చు

  1. దీపారాధన చేయడానికి ఎలా అయితే ఖచ్చితమైన నియమాలు ఉన్నాయో, పూజకు ఉపయోగించే పూలకు సంబంధించి కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. భగవంతుడు పూజకి ఖచ్చితంగా పూలు ఉండాలి.
  2. భగవంతుడుని ప్రసన్నం చేసుకోవడానికి పూలను మనం సమర్పించాలి. భగవంతుడికి పూలను సమర్పించడం వలన పూల తాలూకా పరిమళం, వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. అది మనసును ఆహ్లాద పరుస్తుంది. ఈ సుగంధ శక్తులు మనిషికి సానుకూల శక్తి కలిగేలా చేస్తాయి. ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.

ఏ పూజతో పూజ ఎలా చేయాలి?

  1. ఎప్పుడూ కూడా ఇంట్లో కాని దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు ముందు చిన్న, ప్రకాశవంతమైన పూలను సమర్పించాలి.
  2. ఆ తర్వాత మద్యస్థ పూలను దేవతామూర్తుల విగ్రహానికి సమర్పించాలి.
  3. ఆ తర్వాత పెద్ద, తెల్లని పువ్వులను సమర్పించాలి.
  4. అలాగే పూలను పెట్టేటప్పుడు కొమ్మ దేవతల వైపు పువ్వు రేకులు మన వైపు ఉండేటట్టు సమర్పించాలి.

ఎందుకు వాసన చూసిన పూలతో పూజ చేయకూడదు?

దేవతమూర్తుల్లో ఉండి తరంగాలు పువ్వు ద్వారా పువ్వులు సమర్పించే భక్తునికి చేరుతాయి. పువ్వు కొమ్మ వైపు నుంచి తరంగాలు దేవతామూర్తుల విగ్రహాల నుంచి రేకులకు వ్యాపించి, అవి సువాసన ద్వారా పూజ చేసిన వారికి చేరుకుంటాయి.

రేకులకి ఉండే సువాసన పృద్వితత్వ, అపతత్వ సహాయంతో అవి సుగుణ తరంగాలుగా మారి శక్తిని అందిస్తాయి. ఇలా పూల ద్వారా ఎంతో మంచి శక్తి మనకు అందుతుంది. కాబట్టి పువ్వులను వాసన చూడకుండా దేవతలకు సమర్పించాలి.

ఎందుకు పూజలో బంతి పువ్వులని ఉపయోగించకూడదు?

చాలా మంది బంతి పువ్వులను అందంగా ఉంటాయని.. వాటి రేకులతో అలంకరిస్తూ ఉంటారు. కానీ ఈ పువ్వులను సమర్పించకూడదు అని చెప్తూ ఉంటారు. దాని వెనక కారణమేంటనేది చూస్తే.. బంతిపూలకు శాపం ఉండడం వలన ఆ పూలను పూజకు ఉపయోగించకూడదు.

ఒకవేళ బంతిపూలతో పూజ చేస్తే, ఆ పూజ చేసిన ఫలితం దక్కదు. కేవలం గుమ్మాలకు బంతిపూల దండల్ని కట్టుకోవడం లేదంటే బంతిపూలతో అలంకరణ చేసుకోవడం వంటివి మాత్రమే చేయాలి. పూజకు మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం