చాలామంది పూజ మందిరాన్ని అందంగా అలంకరించుకునేందుకు రకరకాల దేవుడు పటాలను పెడుతూ ఉంటారు. ఎవరైనా దేవుడు పటాలను బహుమతిగా ఇచ్చినప్పుడు లేదా స్వయంగా మనమే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలను కొనుగోలు చేయడం.. ఇలా వివిధ కారణాల వలన దేవుడి మందిరంలో ఫోటోలు ఎక్కువైపోతూ ఉంటాయి.
పూజ గదిలో ఫోటోలు ఎక్కువ అయిపోతే ఏం చేయాలి? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఇంట్లో పూజ గది స్టోర్‌రూమ్‌లా అయిపోతుంది. 50, 100 ఫోటోలు వరకు ఉంటాయి. చాలా మందికి ఇది అలవాటే. అయితే పూజ మందిరంలో దేవుడి ఫోటోలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ మందిరంలో దేవుడు ఫోటోలు ఎక్కువ అయిపోతే వాటిని తీసేస్తూ ఉండాలి. పడకగదిలో దేవుడు ఫోటోలు ఉండకూడదు, హాల్లో దేవుడు ఫోటోలు ఉండకూడదు. చాలా మంది అన్ని ఫోటోలను పూజ గదిలో పెట్టేస్తూ ఉంటారు. అన్ని దేవుడి ఫోటోలను పూజ గదిలో పెట్టాల్సిన అవసరం లేదు.
అన్ని ఫోటోలను చాలామంది పూజ గదిలో పెట్టేసి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయలేక, కడగలేక అలా వదిలేస్తూ ఉంటారు. “కొత్త ఫోటో కనుక వస్తే మా ఇంట్లో పాత ఫోటోలను అన్ని తీసేస్తాము” అని గరికపాటి అన్నారు. ఎప్పటికీ ఆ ఫోటో ఉండాలి, పాపం తగులుతుందని భావించకూడదు.
దేవుడు ఫోటోలను ఎక్కడ పారేయాలో తెలియక చాలా మంది నదుల్లో కలుపుతున్నారు. అది కూడా తప్పే. పూజ గదిలో ఉన్న దేవుడు ఫోటోలను నదిలో పడేయడం గురించి గరికపాటి మాట్లాడుతూ—“నది లోకువగా కనపడుతోందా ? అందుకే పూజ గదిలో దేవుడు ఫోటోలను నదిలో పారేస్తారా?” అని . అలా ఫోటోలు వంటి వాటిని నదిలో పడేయడం మంచిది కాదని గరికపాటి అన్నారు.
పూజ గది నుంచి తొలగించిన ఫోటోలను ఎవరికైనా ఇవ్వడం మంచిదని వారు అన్నారు. ఒకవేళ ఎవరూ తీసుకోకపోతే వాటిని ఒకచోట పెట్టి ఇంట్లో ఉంచండి. తరవాత తరాలు వారు చూసుకుంటారని చెప్పారు.