Puja Flowers: ఏ దేవుడికి ఏ పూలను సమర్పించాలి? పూజలో వాడే పుష్పాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 తప్పులు చేయకండి-puja flowers check which flower to offer to which god and also see what mistakes we should not do while worshipping ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Puja Flowers: ఏ దేవుడికి ఏ పూలను సమర్పించాలి? పూజలో వాడే పుష్పాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 తప్పులు చేయకండి

Puja Flowers: ఏ దేవుడికి ఏ పూలను సమర్పించాలి? పూజలో వాడే పుష్పాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 తప్పులు చేయకండి

Peddinti Sravya HT Telugu
Published Feb 08, 2025 07:00 AM IST

Puja Flowers: పూలతో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాటించాలి. పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను ఉపయోగించాలి?, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

Puja Flowers: ఏ దేవుడికి ఏ పూలను సమర్పించాలి?
Puja Flowers: ఏ దేవుడికి ఏ పూలను సమర్పించాలి? (pinterest)

ప్రతిరోజూ కూడా మనం స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఇంట్లో కూడా రెండు పూట్లా దీపారాధన చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటారు. పూజకి దీపారాధన ఎంత ముఖ్యమో పూలతో పూజ కూడా అంతే ముఖ్యం.

దీపారాధన చేసిన తర్వాత మనం పూలతో పూజ చేస్తాము. అయితే, పూలతో పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాటించాలి. పూజ చేసేటప్పుడు ఎలాంటి పూలను ఉపయోగించాలి?, ఎటువంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

పూజ చేసేటప్పుడు ఎటువంటి పువ్వులను ఉపయోగించకూడదు?

  1. పూజ చేసేటప్పుడు మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, పూజ చేసే పూలు వాసన వచ్చేవై ఉండాలి. వాసన లేని పువ్వులను పూజకి ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగలి పువ్వుతో పూజ చేయకూడదు.
  2. మొగలి పువ్వుతో పూజ చేయడం వలన వంశం నాశనం అయిపోతుంది. మొగలి పువ్వుకి శివుడు శాపం ఇచ్చాడు. కనుక పూజకు మొగలి పువ్వును ఉపయోగించకూడదు. తలలో పెట్టుకోవచ్చు. కానీ పూజకు ఉపయోగించకూడదు.
  3. పూజ చేసేటప్పుడు సున్నితమైన సువాసన వచ్చే పూలను ఉపయోగించవచ్చు.
  4. పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బంతిపూలను ఉపయోగించకూడదు. కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి తప్ప పూజకు వాడకూడదు. బంతిపూలకు ఉన్న శాపం వలన బంతిపూలతో పూజ చేయకూడదు. అందంగా అలంకరించుకోవచ్చు. బంతిపూలతో తోరణాలు కట్టుకోవచ్చు. కానీ పూజకు మాత్రం బంతిపూలు పనికిరావు.
  5. అలాగే పెద్ద కాడతో ఉన్న పూలను పూజకు ఉపయోగించకూడదని చెప్తూ ఉంటారు. కాడతో ఉన్న పూలతో పూజ చేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే చాలామంది చామంతి పూలు రేకులను లేదా గులాబీ రేకులను త్రుంచి పూజ చేస్తారు. కానీ అలా రేకులతో కూడా పూజ చేయకూడదు. పూలతో మాత్రమే పూజ చేయాలి.
  6. పూలను ఉపయోగించేటప్పుడు పుష్పం మొత్తం ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని పువ్వులు సగం మాత్రమే ఉంటాయి. అలాంటి పూలను ఉపయోగించకూడదు. పూజలో గులాబీ పూలను ఉపయోగించేటప్పుడు గులాబీ పూలు ముళ్ళు లేకుండా చూసుకుని, కాడ తుంచేసి పెట్టాలి.

ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలి?

  1. వినాయకుడికి గన్నేరు పూలు, ఎర్రమందారం పూలు అంటే చాలా ఇష్టం. వాటితో వినాయకుడిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  2. శివుడుకి ఉమ్మెత్త పూలతో పూజ చేయడం వలన శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
  3. విష్ణుమూర్తికి పారిజాతం పూలు అంటే ఇష్టం. పారిజాతం పూలతో విష్ణువుని ఆరాధించడం వలన మంచి ఫలితం కనబడుతుంది. సిరిసంపదలు కూడా కలుగుతాయి.
  4. లక్ష్మీదేవికి కమల పూలు అంటే చాలా ఇష్టం కమల పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు.
  5. సరస్వతి దేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. సరస్వతి దేవిని ఆరాధించేటప్పుడు మోదుగ పూలతో ఆరాధించండి.
  6. దుర్గాదేవికి మల్లెపూలు, మందారం, కమలం పూలు అంటే ఇష్టం. ఈ పూలతో దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం