Plants from the Mahabharata: మహాభారతంలో ప్రస్తావించిన ఈ 5 మొక్కలు మీ ఇంట్లోనూ ఉన్నాయా? ఈ మొక్క ఉంటే అదృష్టమే
Plants from the Mahabharata: ఈ మొక్కలకు, చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. వీటిలో కొన్ని ఇంట్లో ఉంటే సానుకూల శక్తి కలగడమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలా మంది ఈ మొక్కలను వారి ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. ఈ మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహాభారతం పురాతన భారతీయ ఇతిహాసం. ఇందులో ప్రధాన కథ రెండు కుటుంబాల (పాండవులు కౌరవుల) చుట్టూ తిరుగుతుంది. మహాభారతం గురించి చెప్పుకుంటే చాలా ఉంది. అయితే, మహాభారతం గురించి పక్కన పెడితే.. మహాభారతంలో ఉన్న మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొక్కలకు, చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. వీటిలో కొన్ని ఇంట్లో ఉంటే సానుకూల శక్తి కలగడమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలా మంది ఈ మొక్కలను వారి ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. ఈ మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వీటిని మీరూ పెంచుతున్నారో లేదో చూసుకోండి.
మహాభారతంలో ఉన్న ఐదు పవిత్ర మొక్కలు
ఈ మొక్కలు సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలని అందిస్తాయి. అలాగే ఇవి ఎన్నో ప్రయోజనాలను కూడా తీసుకు వస్తాయి.
1.తులసి మొక్క
తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తులసి మొక్కని ప్రతీ ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. తులసి మొక్క ముందు దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, సంతోషంగా ఉండొచ్చు అని హిందువుల నమ్మకం.
2.రావి చెట్టు
రావి చెట్టును పూజిస్తే శుభం కలుగుతుంది. రావి చెట్టు మూలంలో మహావిష్ణువు, రావి చెట్టు కాండంలో శివుడు, ముందు భాగంలో బ్రహ్మ ఉన్నారని చెప్తారు. సనాతన ధర్మంలో దేవతల దేవుడని రావి చెట్టుని పిలుస్తారు. పురాణ గ్రంథాలలో రావి చెట్టుని బ్రహ్మ నివాసంగా భావించడం జరిగింది.
3.చందనం చెట్టు
ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. చందనం సువాసనకు ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఎర్ర చందనంతో అనేక అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
4.వెదురు మొక్క
వెదురు మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వెదురు మొక్కను ఆఫీస్ టేబుల్ పై పెడితే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది.
5.అశ్వత్థ వృక్షం
దీని గురించి మహాభారతంలో మాత్రమే భగవద్గీతలో కూడా ప్రస్తావించబడింది. వేర్లు పైన, కొమ్మలు క్రింద ఉన్న చెట్టు అని కృష్ణుడు వర్ణించారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం