Planets Transit 2025 January: జనవరిలో 4 శక్తివంతమైన గ్రహాల సంచారం.. కొత్త ఏడాది మొదటి నెల ఈ రాశుల వారికి కాసుల వర్షం
Planets Transit 2025 January: శక్తివంతమైన గ్రహాల గమనంతో జనవరి నెలలో పలువురికి మంచి ప్రయోజనాలు అందబోతున్నాయి. అయితే, ఈ గ్రహాల మార్పు వలన పలు రాశుల వారిపై ప్రభావం పడుతుంది. జనవరి 2025లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏయే మార్పులు వస్తాయి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం
ఇంకో కొన్ని రోజుల్లో 2024 ముగిసిపోతుంది. 2025 వచ్చేస్తుంది. మొదటి నెల జనవరి చాలా మంచి సమయం. శక్తివంతమైన గ్రహాల గమనంతో జనవరి నెలలో పలువురికి మంచి ప్రయోజనాలు అందబోతున్నాయి. అయితే, ఈ గ్రహాల మార్పు వలన పలు రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
జనవరి 2025లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏయే మార్పులు వస్తాయి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు గ్రహాల సంచారం జనవరి 2025 లో జరగబోతోంది.
బుధుడు సంచారం
జనవరి నెల బుధుడు సంచారంతో మొదలు కాబోతోంది. 2025 జనవరి 4న వృశ్చిక రాశిని వదిలిపెట్టి ధనస్సు రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఈ రాశిలో 20 రోజులు ఉంటాడు. జనవరి 24న మకర రాశిలో ప్రవేశిస్తాడు.
సూర్యుని సంచారం
రెండవది సూర్య సంచారం. సూర్యుని సంచారం కూడా పలు మార్పులకి చోటు చేసుకుంటుంది. సూర్య భగవానుడు జనవరి 14న మకర సంక్రాంతి రోజున ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమిస్తాడు. దీంతో ప్రయాగరాజ్ లో మహాకుంభం మొదలవుతుంది. అన్ని శుభకార్యాలు కూడా ఆ రోజు నుండి మొదలవుతాయి.
కుజుడు సంచారం
మూడవది కుజుడు సంచారం. జనవరిలో ఉండబోతోంది. కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించి ఆశీర్వాదాలను కురిపిస్తాడు. జనవరి 21న మిధున రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో పలు రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
శుక్రుడు సంచారం
నాలుగవది శుక్రుడు సంచారం. శుక్రుడు సంచారంతో జనవరి 2025 పలు రాశులలో మార్పు ఉంటుంది. శుక్రుడు సంపద, శ్రేయస్సుకి అధిపతి. శుక్రుడు 28 జనవరి 2025న కుంభం నుంచి మీన రాశిలోకి సంచరిస్తాడు.
గ్రహాల మార్పు ఏ రాశులపై ప్రభావం చూపిస్తుంది..
కుంభ రాశి
జనవరి 2025 కుంభ రాశి వారికి బాగుంటుంది. ఈ గ్రహాల మార్పు వలన కుంభ రాశి వారికి లాభాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం మొదటి నెల ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తులా రాశి
కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో తులా రాశి వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. పోటీ పరీక్షలకు చదువుతున్న వారు సక్సెస్ అందుకుంటారు. సొంత వ్యాపారం చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మేష రాశి
మేష రాశి వారికి మొదటి నెల చాలా బాగుంటుంది. మీ ఉద్యోగ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి పై అధికారులు మీపై పెద్ద బాధ్యతని అప్పగించగలుగుతారు. ఒంటరి వ్యక్తులు వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం