Planets Conjunction: 57 సంవత్సరాల తర్వాత అరుదైన యాదృచ్చికం, 6 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి తిరుగేలేదు-planets conjunction after 57 years 6 planets are meeting in march these 3 zodiac signs will get many benefits check your ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planets Conjunction: 57 సంవత్సరాల తర్వాత అరుదైన యాదృచ్చికం, 6 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి తిరుగేలేదు

Planets Conjunction: 57 సంవత్సరాల తర్వాత అరుదైన యాదృచ్చికం, 6 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి తిరుగేలేదు

Peddinti Sravya HT Telugu

Planets Conjunction: అన్ని గ్రహాలు కూడా కాలానుగుణంగా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు, ప్రత్యేక కలయికలు ఏర్పడుతూ ఉంటాయి. దీని ప్రభావం 12 రాశులపై వేరు వేరుగా ఉంటుంది. అటువంటి ప్రత్యేక సందర్భం మార్చి 29, 2025న రాబోతోంది. మీన రాశిలో 6 శక్తివంతమైన గ్రహాలు కలిసి ఒక ప్రత్యేక కలయికని ఏర్పరుస్తున్నాయి.

Planets Conjunction: 57 సంవత్సరాల తర్వాత అరుదైన యాదృచ్చికం, 6 గ్రహాల కలయిక

సుమారు 57 ఏళ్ల తర్వాత ఆరు శక్తివంతమైన గ్రహాలు కలయిక చోటు చేసుకోబోతోంది. అయితే, ఈ యాదృచ్ఛికం కారణంగా మూడు రాశుల వారు విపరీతంగా ప్రయోజనాలని పొందే అవకాశం ఉంటుంది.

వేద గ్రంధాల ప్రకారం సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు కూడా కాలానుగుణంగా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు, ప్రత్యేక కలయికలు ఏర్పడుతూ ఉంటాయి. దీని ప్రభావం 12 రాశులపై వేరు వేరుగా ఉంటుంది.

అటువంటి ప్రత్యేక సందర్భం మార్చి 29, 2025న రాబోతోంది. మీన రాశిలో 6 శక్తివంతమైన గ్రహాలు కలిసి ఒక ప్రత్యేక కలయికని ఏర్పరుస్తున్నాయి.

ఏ గ్రహాల కలయిక చూడబోతున్నాము?

జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాహువు, శుక్రుడు ఇప్పటికే మీనరాశిలో ఉన్నారు. ఫిబ్రవరిలో బుధుడు కూడా మీనరాశిలో చేరుకుంటారు. ఆ తర్వాత మార్చి 14న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు మార్చి 28న ప్రవేశిస్తాడు. మార్చి 29న శని మీనరాశిలో సంచరిస్తాడు.

ఈ విధంగా మార్చి 29న మీన రాశిలో ఈ ఆరు గ్రహాల కలయిక చోటు చేసుకోబోతోంది. ఈ కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. సమాజంలో గౌరవ స్థానం లభిస్తుంది. అలాగే ఇంకా పలు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

1. మిధున రాశి

ఈ ఆరు గ్రహాల కలయిక కారణంగా మిధున రాశి వారికి మార్పు రాబోతోంది. మిధున రాశి వారికి ఈ గ్రహాలు కలయిక శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో మీ కష్టాన్ని అందరూ అభినందిస్తారు. కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకి ధన లాభం కలుగుతుంది.

2. కుంభ రాశి

ఈ ఆరు గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశి వారికి కూడా మార్పు రాబోతోంది. మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సృజనాత్మకత ఆఫీసులో మీకు ప్రయోజనాన్ని అందించబోతోంది. సొంత వెంచర్ ప్రారంభించాలి అనుకుంటే కూడా ఇదే మంచి సమయం. ఇతరులకి మీరు డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే, ఆ డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ గ్రహాలు కలయిక వలన పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

3. మకర రాశి

ఈ ఆరు గ్రహాల కలయిక వలన మకర రాశి వారికి కూడా ప్రయోజనం కలగబోతోంది. ఈ ప్రత్యేక గ్రహాల కలయిక మీకు విజయాన్ని అందిస్తుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.