Planet transit: సూర్యుడి రాశిలో గ్రహాల జాతర.. మూడు రాశుల వారికి పండగే-planet transit in surya rasi leo three zodiac signs get full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Transit: సూర్యుడి రాశిలో గ్రహాల జాతర.. మూడు రాశుల వారికి పండగే

Planet transit: సూర్యుడి రాశిలో గ్రహాల జాతర.. మూడు రాశుల వారికి పండగే

Gunti Soundarya HT Telugu

Planet transit: సూర్యుడి రాశిలో గ్రహాల జాతర జరగబోతుంది. ఆగస్ట్ నెలలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో గ్రహాల కలయిక జరగనుంది. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి అధిక ప్రయోజనాలు దక్కుతాయి.

సూర్యుడి రాశిలో గ్రహాల జాతర (freepik)

Planet transit: మరికొద్ది రోజుల్లో సూర్య రాశిలో గ్రహాల రాకపోకలు జరగబోతున్నాయి. సింహ రాశిలో మూడు ప్రధాన గ్రహాలు కలవబోతున్నాయి. సింహ రాశికి అధిపతి సూర్యుడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. జులై నెలలో శుక్రుడు రెండో సారి తన రాశిని మార్చుకుంటాడు. ఇది జూలై 31 న సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది.

గ్రహాల రాకుమారుడైన బుధుడు జులై 19 నుంచి సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వచ్చే నెల నుంచి తన ప్రయాణం సాగించబోతున్నాడు. ఆగస్ట్ 16న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించిన వెంటనే బుధుడు, శుక్రుడు, సూర్యుని కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కలుగుతుంది. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక జరగడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని అత్యంత శుభప్రదమైనదిగా పిలుస్తారు. ఇవి మాత్రమే కాకుండా లక్ష్మీనారాయణ యోగం, బుధాదిత్య యోగం కూడా ఏర్పడతాయి. సింహ రాశి సూర్యభగవానుడి స్వంతం. సింహ రాశిలో శుక్రుడు, సూర్యుడు, బుధుడు సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్ట సమయం ప్రారంభం కావచ్చు. బుధుడు, శుక్రుడు, సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశించబోతుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి

బుధుడు, శుక్రుడు, సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. గ్రహాల కదలికలో మార్పు కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. కష్ట సమయాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.

ధనుస్సు రాశి

సింహ రాశిలో మూడు గ్రహాల సంచారం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అనేక కొత్త వనరులను చూస్తారు. ఈ నెలలో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. అదే సమయంలో, మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడితో మంచి సమయాన్ని గడుపుతారు.

సింహ రాశి

మూడు గ్రహాల కలయిక సింహ రాశిలోనే జరగబోతుంది. దీని వల్ల సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో మీరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయట పడతారు. త్రిగ్రాహి యోగం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు లాభదాయకంగా ఉంటాయి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.