Phone Number Numerology: న్యూమరాలజీతో సరైన మొబైల్ నంబర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఈ మార్పుతో, జీవితంలో కోరుకున్నవి పొందవచ్చు!-phone number numerology these changes will turn your life and gives what you need ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Phone Number Numerology: న్యూమరాలజీతో సరైన మొబైల్ నంబర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఈ మార్పుతో, జీవితంలో కోరుకున్నవి పొందవచ్చు!

Phone Number Numerology: న్యూమరాలజీతో సరైన మొబైల్ నంబర్‌ను ఎలా ఎంచుకోవాలి? ఈ మార్పుతో, జీవితంలో కోరుకున్నవి పొందవచ్చు!

Peddinti Sravya HT Telugu

Phone Number Numerology: కొన్ని సంఖ్యలు పాజిటివిటీని తీసుకువస్తాయి. న్యూమరాలజీ ప్రకారం ఏ మొబైల్ నెంబర్ బావుంటుంది, మీ ఫోన్ నంబర్ మీకు అదృష్టాన్ని ఎలా తీసుకువస్తుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూమరాలజీతో సరైన మొబైల్ నంబర్‌ను ఎలా ఎంచుకోవాలి? (pinterest)

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని ఆలోచించారా..? మీ మొబైల్ నెంబర్ ఎలా మీ జీవితం పై ప్రభావం చూపిస్తుందని.. అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మాదిరి మొబైల్ నెంబర్ కూడా స్పెషల్ పవర్ ని కలిగి ఉంటుంది.

న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు పాజిటివిటీని తీసుకువస్తాయి. న్యూమరాలజీ ప్రకారం ఏ మొబైల్ నెంబర్ బావుంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూమరాలజీ ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈరోజు ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు ఎన్నో న్యూమరాలజీ చెప్తుంది.

న్యూమరాలజీ ఎలా పని చేస్తుంది?

న్యూమరాలజీ మన జీవితానికి దిక్సూచి మాదిరి పనిచేస్తుంది. ప్రతి సంఖ్యకి కూడా ప్రత్యేక ఎనర్జీ ఉంటుంది. ఉదాహరణకు ఒకటి సంఖ్య నాయకత్వం, రెండు శాంతి.. ఇలా ప్రతి సంఖ్యకి కూడా ప్రత్యేకత ఉంటుంది.

మీ మొబైల్ నెంబర్ ఎందుకు ముఖ్యం?

మొబైల్ నెంబర్స్ కేవలం అంకెలు మాత్రం కాదు. ఒక గుర్తింపు కూడా. మీ పేరు, పుట్టిన రోజు మాదిరి మొబైల్ నెంబర్ కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ మీకు అదృష్టాన్ని తీసుకువస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అనుకున్న వాటిని పూర్తి చేయగలుగుతారు.

మొబైల్ నెంబర్ ద్వారా యూనిట్ అంకెను ఎలా తెలుసుకోవాలి?

ఉదాహరణకు ' 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 + 0 = 45.' ఇప్పుడు నాలుగు, ఐదు కలపండి. తొమ్మది వచ్చింది కదా? అంటే అప్పుడు యూనిట్ అంకె 9 అవుతుంది.

ఏ నెంబర్ ఏం చెప్తోంది?

ప్రతి సంఖ్యకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ సంఖ్యకి ఎలాంటి ప్రత్యేకత ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1- నాయకత్వం, స్వాతంత్రం,కొత్త ప్రారంభం.

2- సామరస్యం, సమతుల్యత, భాగస్వామ్యాలు.

3- సృజనాత్మకత, కమ్యూనికేషన్, ఆనందం.

4- స్థిరత్వం, కృషి, ఆచరణాత్మకత.

5- సాహసం, మార్పు, స్వేచ్ఛ.

6- ప్రేమ, కుటుంబం, బాధ్యత.

7-ఆధ్యాత్మికత, ఆత్మపరిశీలన, జ్ఞానం.

8- శక్తి, విజయం, సమృద్ధి.

9- కరుణ, మానవతావాదం, ముగింపులు.

మీ లక్ష్యాలు, కోరికలతో సరిపోయే మొబైల్ నంబర్‌ ఎంచుకోవడం వలన సరైన శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగాన్ని మొదలు పెట్టాలనుకుంటే, 1 ఉన్న సంఖ్య మీ లీడర్షిప్ స్కిల్స్ ని మెరుగుపరుస్తుంది. అదే మీరు ప్రేమ కోసం చూస్తున్నట్లయితే, మీకు 6 సంఖ్య మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం