Phalguna pournami: ఫాల్గుణ పౌర్ణమి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది?
Phalguna pournami: ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి కన్యా రాశిలో ఏర్పడబోతుంది. ఫలితంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్నింటి మీద ప్రభావం ఉండనుంది. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం.
Phalguna pournami: ఫాల్గుణ మాసంలో పౌర్ణమి మార్చి 24న వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమిని మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో చంద్రుడు కన్యరాశిలో ఉంటాడు. ఈ రాశికి గ్రహాల రాకుమారుడు బుధుడు అధిపతిగా ఉన్నాడు.
చంద్రుడు, బుధ గ్రహాలు రెండూ సున్నితమైనవి. పౌర్ణమి రోజే హోలికా దహనం నిర్వహిస్తారు. పౌర్ణమి తిథి మరుసటి రోజు కూడా ఉండటంతో మార్చి 25న హోలీ పండుగ జరుపుకుంటారు. ఆ రోజే తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. పౌర్ణమి ప్రభావం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి గురవుతారు. రోజువారి పనులు, ఆఫీసు విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి.
వృషభ రాశి
ఈ పౌర్ణమి వృషభ రాశి వారికి సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ప్రేమ సంబంధాలపై పౌర్ణమి ప్రభావం ఉంటుంది. మీ కళాత్మకతను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. భావోద్వేగ క్షణాలు అనుభవిస్తారు.
మిథున రాశి
ఈ పౌర్ణమి సమయంలో మిథున రాశి వాళ్ళు ఇల్లు, కుటుంబానికి సంబంధించిన ఆందోళనలపై ఎక్కువ దృష్టి పెడతారు. వాటిని పరిష్కరించుకోవడం కోసం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడుపుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు. ఇతరులతో సంభాషించడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం. మీ చుట్టూ ఉన్న విషయాలు మిమ్మల్ని మరింత భావోద్వేగానికి గురిచేస్తాయి.
సింహ రాశి
పౌర్ణమి సమయంలో సింహ రాశి వారికి డబ్బు చేతికి అందుతుంది.ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కలలు నెరవేరతాయి.
కన్యా రాశి
ఈ సమయంలో స్వీయ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. మీకు కావాల్సిన పనులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు ఇదొక అద్భుతమైన సమయం.
తులా రాశి
ఈ పౌర్ణమి సమయంలో తులా రాశి వారు ఆధ్యాత్మికం వైపు దృష్టి కేంద్రీకరిస్తారు. ధ్యానం చేస్తారు. మనసులో ఒత్తిడి లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టం చూపిస్తారు.
వృశ్చిక రాశి
పౌర్ణమి సమయంలో వృశ్చిక రాశి వారికి మతపరమైన కార్యకలాపాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులతో, స్నేహితులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వ్యక్తులు పౌర్ణమి సమయంలో వృత్తిపరమైన లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. మీ లక్ష్యాలను, కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
మకర రాశి
మకర రాశి జాతకులు ఉన్నత విద్యపై ఎక్కువ దృష్టి పెడతారు. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. వాటిని అమలుపరుచుకునే దాని గురించి ఆలోచిస్తారు.
కుంభ రాశి
పౌర్ణమి సమయంలో వ్యక్తిగత సంబంధాలు, జీవిత భాగస్వామితో ఉండే ప్రేమపూర్వకమైన సంబంధాలపై దృష్టి పెడతారు. ఆర్థిక సమస్యలు అధిగమించడం కాస్త కష్టంగా ఉంటుంది. సన్నిహితులతో సంబంధాలు భావోద్వేగపూరితంగా ఉంటాయి.
మీన రాశి
ఈ పౌర్ణమి సమయంలో మీన రాశి వారు జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా భావోద్వేగానికి గురవుతారు. మనసు బాధతో నిండిపోతుంది.