Phalguna Month 2025: ఫాల్గుణ మాసం ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్రతాలు, పండుగలు, వివాహ ముహూర్తాలు తెలుసుకోండి-phalguna month 2025 check this new telugu month important dates festivals vratas and marriage muhurtam details as well ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Phalguna Month 2025: ఫాల్గుణ మాసం ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్రతాలు, పండుగలు, వివాహ ముహూర్తాలు తెలుసుకోండి

Phalguna Month 2025: ఫాల్గుణ మాసం ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్రతాలు, పండుగలు, వివాహ ముహూర్తాలు తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Published Feb 12, 2025 10:30 AM IST

Phalguna Month: హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి 1 ప్రారంభమై మార్చి 29న ముగుస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మహాశివరాత్రి, హోలీతో సహా అనేక ముఖ్యమైన వ్రతాలు మరియు పండుగలు జరుపుకుంటారు.

Phalguna Masam: 2025 ఫాల్గుణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Phalguna Masam: 2025 ఫాల్గుణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

హిందూ పంచాంగంలో చివరిది అయిన 12వ నెల ఫాల్గుణ మాసం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మహాశివరాత్రి, హొలీ, ఆమలకీ ఏకాదశితో సహా అనేక పెద్ద వ్రతాలు మరియు పండుగలు జరుపుకుంటారు.

వ్రతాలు-పండుగలతో పాటు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా శుభ సమయం. ఫాల్గుణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. అలాగే ఈ నెలలో ఏ వ్రతాలు, పండుగలు జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం.

ఫాల్గుణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

హిందూ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్ష ప్రతిపద తిథి మార్చి 1, 2025 ప్రారంభమై మార్చి 29, 2025తో ముగుస్తుంది.

ఫిబ్రవరి, మార్చిలో చేయాల్సిన వ్రతాలు మరియు పండుగలు:

ద్విజప్రియ సంకష్ట చతుర్థి - ఫిబ్రవరి 16, 2025, ఆదివారం

విజయ ఏకాదశి - ఫిబ్రవరి 24, 2025, సోమవారం

ప్రదోష వ్రతం - ఫిబ్రవరి 25, 2025, మంగళవారం

మహాశివరాత్రి - ఫిబ్రవరి 26, 2025, బుధవారం

ఫాల్గుణ అమావాస్య - ఫిబ్రవరి 27, 2025, గురువారం

ఫుల్లారా ద్వితీయా - మార్చి 1, 2025, శనివారం

ఆమలకీ ఏకాదశి - మార్చి 10, 2025, సోమవారం

ప్రదోష వ్రతం - మార్చి 11, 2025, మంగళవారం

హోళిక దహనం - మార్చి 13, 2025, గురువారం

హొలీ- మార్చి 14, 2025, శుక్రవారం

చంద్రగ్రహణం - మార్చి 14, 2025, శుక్రవారం

ఫాల్గుణ పౌర్ణమి - మార్చి 14, 2025, శుక్రవారం

వివాహ ముహూర్తాలు:

ఫిబ్రవరి 2025: 13, 14, 15, 16, 18, 19, 21, 23, 25

మార్చి 2025: 1, 2, 6, 7, 12

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail
Whats_app_banner

సంబంధిత కథనం