మీ రాశికి తగ్గ పెంపుడు జంతువేదో మీకు తెలుసా..?
పెంపుడు జంతువును ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నారా..? జంతు ప్రేమ మీకు మేలే చేస్తుంది. అయితే మీ రాశికి తగ్గ పెంపుడు జంతువేదో మీకు తెలుసా మరి! కుక్కలు, చేపలు లేదా ఏదైనా ప్రత్యేకమైన జంతువును తెచ్చుకుందామనుకుంటే అది మీకు సూట్ అవుతుందా లేదానని చెక్ చేసుకోండి.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ప్రతి రాశికి విశిష్టమైన గుణం ఉంటుంది. ఇక పెంపుడు జంతువుల విషయానికొస్తే, ఒక్కో రాశికి ఒక్కో శక్తి ఉంటుంది. కొందరి జన్మ రాశులకు ప్రత్యేకించి కొన్ని జంతువులు మాత్రమే సరిపోతాయి. రాశులకు సరిపడని జంతువులు తెచ్చుకుని నష్టపోకుండా మీకు అనుగుణమైన పెంపుడు జంతువుతో మీ స్టార్ మార్చేసుకోండి.
మేషం:
ఈ రాశి వారు ఎప్పుడూ చురుకుగా, సాహసోపేతంగా ఉంటారు. వీళ్లు పెంపుడు జంతువు కోసం కుక్కను ఎంచుకోవడం బెటర్. ఎల్లప్పుడూ పరుగులు, దూకుళ్లతో ఫుల్ టైం ప్లేటైమ్‌తో పుష్కలంగా ఎంజాయ్ చేయొచ్చు.
వృషభం:
వీళ్లు సౌఖ్యాన్ని కోరుకునే వ్యక్తులు. ఈ వ్యక్తిత్వం కలవారు పిల్లితో అద్భుతంగా మ్యాచ్ అవుతారు. ప్రత్యేకించి ప్రశాంతమైన, ప్రేమగల స్వభావం ఉండటం వల్ల పిల్లితో మంచి స్నేహం కుదురుతుంది. ఈ జోడీ మంచి ఉల్లాసంగా గంటల సమయం గడపచ్చు.
మిథునం:
శ్రద్ధ, ఏకాగ్రతతో ఏదైనా నేర్చుకోవాలనే కుతూహలంతో ఉండే వ్యక్తులు ఈ రాశి వారు. సాటి పక్షుల శబ్దాలను అనుకరించే బుద్ది ఉన్న చిలుకలతో వీరికి బాగా జత కుదురుతుంది.
కర్కాటకం:
వీరి వ్యక్తిత్వం మృదువుగా, కాస్త పిరికితనంతో కూడి ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండే కుందేళ్లు వీరి స్వభావానికి చక్కగా సరిపోతాయి.
సింహం:
లియో (సింహ రాశి) కలిగి ఉన్న వారు తమలాగే శ్రద్ధగా ప్రేమించే వారి కోసం చూస్తుంటారు. వీరికి గ్రాండ్ అక్వేరియంలోని రంగురంగుల చేపలు లాంటివి సరైన పెంపుడు జంతువులు. సింహరాశి ఉన్న వారి ఆలోచనలకు తగ్గట్లుగా అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
కన్య:
అందమైన నిర్మాణాలను, ఇతరులలోని తెలివితేటలను మెచ్చుకునే కన్య రాశి వారు లాబ్రడార్, జర్మన్ షెపార్ట్ వంటి సుశిక్షితులైన కుక్కలను పెంచుకోవడం బెటర్. మెరుగైన శిక్షణ అందుకున్న ఈ కుక్కలు నమ్మకంగా ఉంటూ మంచి ఫ్రెండ్ షిప్‌తో వ్యవహరిస్తాయి.
తుల:
ఈ రాశి ఉన్న వారికి ఇతరులతో చాలా సామరస్యంగా మెలిగే స్వభావం ఉంటుంది. ప్రశాంతంగా ఉండే పందులు వీరికి బాగా జత కడతాయి.
వృశ్చికం:
వీరికి రహస్యంగా ఉండటం, కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడం సహజ స్వభావం. సరీసృపాలు ఈ రాశి వారికి బాగా జత కడతాయి. ముఖ్య పాములతో వీరికి మంచి అనుబంధం ఉంటుంది. పాము ప్రత్యేకమైన ఆకర్షణ, వృశ్చిక రాశి వారి లోతైన పరిశీలన అంశాలు అసాధారణమైన వాటి పట్ల మోహాన్ని ప్రేరేపిస్తాయి.
ధనుస్సు:
ఈ రాశి గల వారి వ్యక్తిత్వం సాహసోపేతమైనది. గుర్రం వంటి సాహసోపేతమైన స్ఫూర్తితో కూడిన జంతువు వీరికి స్నేహంగా దొరికితే చక్కటి అనుబంధంతో ఉంటారు.
మకరం:
ఆచరణాత్మక స్వభావం కల వీరికి ఫిష్ ట్యాంకు బాగా సరిపోతుంది. ముఖ్యంగా తక్కువ చేపలతో నిర్వహణ, ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేకపోవడం వంటివి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
కుంభం:
ఎల్లప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ తో ఉండే కుంభరాశి వారికి ఫెర్రేట్ వంటి పెంపుడు జంతువు బాగా కనెక్ట్ అవుతుంది. ఇవి బాగా తెలివైనవి, చమత్కారమైనవి కావడంతో ఎక్కువసేపు ఆడుకోవడానికి కూడా టైం కుదురుతుంది. వీరిద్దరిలో ఉండే స్వేచ్ఛా స్ఫూర్తి మంచి ఆదర్శవంతమైన స్నేహితులుగా చేస్తాయి.
మీనం:
ఈ రాశి పేరుకు తగ్గట్లుగా కలలు కనే స్వభావంతో పాటు ప్రశాంతంగా ఉంటారు. ట్యాంక్‌లో ఉండి ప్రశాంతమైన, శాంతియుత కదలికలు కలిగి ఉండే చేపలతో వీరికి స్నేహం బాగా కుదురుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్