ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు.. అసంతృప్తితో జీవిస్తారు!-people who have these qualities cannot live with satisfaction according to vidhura niti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు.. అసంతృప్తితో జీవిస్తారు!

ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు.. అసంతృప్తితో జీవిస్తారు!

Peddinti Sravya HT Telugu

మహాభారతంలో ఉన్న ముఖ్యమైన పాత్రల్లో విదురుడు ఒకరు. విదురుడికి ఉన్న జ్ఞానం, తెలివితేటలు, కృష్ణ భక్తి కారణంగా ఇప్పటికీ ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటున్నారు. విదురుడు చెప్పిన విషయాలను మనం పాటించినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు (pinterest)

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రతికూల ఆలోచనలు వదిలిపెట్టాలి. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలంటే గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే వారి ఆలోచనల నుంచి కూడా మనం ప్రేరణ పొందవచ్చు.

మహాభారతంలో ఉన్న ముఖ్యమైన పాత్రల్లో విదురుడు ఒకరు. విదురుడికి ఉన్న జ్ఞానం, తెలివితేటలు, కృష్ణ భక్తి కారణంగా ఇప్పటికీ ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటున్నారు. విదురుడు చెప్పిన విషయాలను మనం పాటించినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అసంతృప్తిగా ఉండే వ్యక్తుల గురించి విదురుడు చెప్పారు. వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, సరిగ్గా కాదు, ఇతరులను కూడా బాధ పెడతారని అన్నారు.

ఎలాంటి గుణాలు ఉన్నవారు సంతృప్తిగా, సంతోషంగా ఉండరు?

1.ద్వేషం:

ఎవరికైతే ద్వేషం, అసూయ ఎక్కువగా ఉంటాయో వారు సంతోషంగా ఉండరు. ఇతరులను సంతోషంగా ఉండనివ్వరూ. వారు చివరకు ప్రతికూలతను, ఒంటరితనాన్ని ఎంచుకుంటారని విదురుడు చెప్పారు. తన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి కూడా దూరమవుతారు.

2.అసూయ:

ఎవరికైతే అసూయ ఉంటుందో వారు జీవితంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఎంతో తక్కువగా ఉంటుంది. అసూయ ఉండే వ్యక్తి ఇతరుల్లో కూడా ప్రతికూల ఆలోచనలను పెంచుతాడు.

3.కోపం:

కోపం ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు దుఃఖంతో ఉంటారని విదురుడు చెప్పారు. ఎక్కువ కోపం ఉంటే అది జీవితంలోని సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. రిలేషన్స్‌ని కూడా బాగా దెబ్బతీస్తుందని విదురనీతిలో చెప్పారు.

4.ఇతరులపై ఆధారపడడం:

ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడకూడదు. కష్టపడి సక్సెస్‌ను అందుకోవచ్చు. ఇతరులపై ఆధారపడే వారు గౌరవాన్ని కూడా పొందలేరు, సంతోషంగా ఉండలేరు.

5.సంతృప్తి లేకపోవడం:

ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో వారు అస్సలు సంతృప్తిగా జీవించలేరు. ఎప్పుడూ కూడా సంతృప్తి చాలా ముఖ్యం. ఉన్నదాంట్లో సంతృప్తి పడాలి. లేని దానికోసం మనసును పాడు చేసుకోకూడదు. సంతోషంగా ఉండాలంటే మాత్రం కచ్చితంగా ఉన్న దానితోనే సంతృప్తి చెందాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.