న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవడంతో పాటు ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం 1,10,19, 28 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ ఒకటి అవుతుంది. రాడిక్స్ నెంబర్ 1కి అధిపతి సూర్యుడు.
జీవశక్తికి చిహ్నం. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ ఒకటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం. మీరు కూడా ఈ తేదీల్లోపుట్టినట్టైతే ,గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు.
రాడిక్స్ నెంబర్ 1 వారు నిజాయితీగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని అనుకోరు. పైగా ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులని ఈజీగా ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామిని కూడా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు కోపిష్టిగా కూడా ఉంటారు. తల్లిదండ్రుల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎక్కువగా వారిని కూడా ప్రేమిస్తారు.
రాడిక్స్ నెంబర్ ఒకటి వారు బిజినెస్ లో బాగా రాణిస్తారు. భవిష్యత్తులో ప్రగతి సాధిస్తారు. వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాడిక్స్ నెంబర్ ఒకటి వారు యాక్టివ్ గా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
రాడిక్స్ నెంబర్ ఒకటి వారు మంచి మిత్రులు. స్నేహాన్ని నిజాయితీగా కాపాడుకుంటారు. ఎప్పుడైనా స్నేహితుడికి కష్టం వస్తే ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోరు. కష్టకాలంలో కూడా తోడుగా ఉంటారు.
వారి సమస్యల్ని సులువుగా పరిష్కరిస్తారు. రాడిక్స్ నెంబర్ ఒకటి వారు స్నేహితుల కోసం ఏమైనా చేస్తారు. ఎంతటి వరకు అయినా వెళ్తారు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇచ్చిన మాటని పక్కా నిలబెట్టుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్