ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్టం, వారి ఇంట్లో ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తుంది.. దేనికీ లోటు ఉండదు!-people who born on these days are very lucky to their husbands and brings lots of wealth says numerology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్టం, వారి ఇంట్లో ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తుంది.. దేనికీ లోటు ఉండదు!

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్టం, వారి ఇంట్లో ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తుంది.. దేనికీ లోటు ఉండదు!

Peddinti Sravya HT Telugu

న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తలకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తారు. వారి భర్తలు జీవితంలో సంతోషంగా ఉంటారు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్టం (pinterest)

న్యూమరాలజీ ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే, కొన్ని సంఖ్యలు వారు భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నంబర్ ని తెలుసుకోవచ్చు.

రాడిక్స్ నెంబర్ 3

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నంబర్ 3కి చెందినవారు. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తలకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తారు. వారి భర్తలు జీవితంలో సంతోషంగా ఉంటారు, సక్సెస్ ను అందుకుంటారు. వారి జీవితంలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.

అదృష్టవంతులు, లక్ష్మీదేవి

ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తకు విపరీతమైన అదృష్టాన్ని తీసుకు వస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషం, ధనం, ప్రశాంతత ఉంటాయి. వీరిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

సానుకూల శక్తి:

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వారి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారి భర్తకు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, వారి వెనుక నిలబడతారు. వారిని ఇన్‌స్పైర్ చేసి, ముందుకు నడిచేలా చేస్తారు.

తెలివితేటలు:

రాడిక్స్ నంబర్ 3 వారు చాలా తెలివైన వారు. ప్రాక్టికల్ గా నిర్ణయాలు తీసుకుంటారు. వారి భర్తలకు ఇచ్చే సలహాలు, వారి భర్త కెరీర్ కి, బిజినెస్ కి ఎంతో సహాయం చేస్తాయి. డబ్బులను సరిగ్గా వినియోగిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు డబ్బులను తెలివిగా సేవింగ్స్ చేస్తారు, బాగా సంపాదన కలిగి సంతోషంగా ఉండేలా చూస్తారు.

ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?

పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ విధేయతతో, ప్రేమతో సంబంధాలను కొనసాగిస్తారు. భర్తకు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఇది జీవితంలోని ప్రతి మలుపులో విజయపథాన్ని సులభం చేస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.