ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పెళ్లి తర్వాత జీవితమే మారిపోతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటే జీవితాంతం ఏ ఇబ్బంది రాదు. అయితే, పెళ్లి అంటేనే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అబ్బాయిలకి కూడా జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అని కొన్ని కోరికలు ఉంటాయి. వారిని బాగా ప్రేమించాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ చాలా మంది వైవాహిక జీవితంలో సంతోషంగానే ఉంటారు.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం భాగస్వామిని బాగా చూసుకుంటారు. కోరికలు కూడా నెరవేరుతాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు భార్యగా లేదా భర్తగా వస్తే, జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామిని ఎంతో బాగా చూసుకుంటారు. ఎక్కువగా ప్రేమిస్తారు. మరి ఆ తేదీల్లో పుట్టిన వారి గురించి ఇప్పుడే చూసేద్దాం.
1,3, 6,8,9,10, 12, 15,17, 18, 19, 21, 24, 26, 27, 28, 30 తేదీల్లో పుట్టిన వారు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు . పైగా రోజులు గడిచే కొద్ది వీరి ప్రేమ తరగదు. మారిపోరు. మొదటిసారి ఎలా ఉన్నారో జీవితాంతం అలానే ఉంటారు. పైగా వీరికి ఎంత ప్రేమ ఉన్నా బయటకి చెప్పరు. ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు.
వీళ్ళు చేసే పనులు బట్టి మీరు ఎంత ప్రేమిస్తున్నారో జీవిత భాగస్వామికి అర్థం అవుతుంది. కానీ ఆ ప్రేమను మాత్రం బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. అప్పుడప్పుడు ప్రేమను బయటకి చెప్పడమే మంచిది లేదంటే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రేమ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. పరిస్థితులను బట్టి ప్రేమ తగ్గిపోదు. ఎల్లప్పుడూ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలని అనుకుంటారు. వారిని ఎంతో బాగా చూసుకుంటారు. నిజానికి ఇటువంటి వారికి భాగస్వామి అయితే కచ్చితంగా జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్