ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!-people who born on these dates will love their partner from bottom of the heart based on numerology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!

ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!

Peddinti Sravya HT Telugu

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి జీవితంలో జరగనున్న విషయాల గురించి కూడా చెప్పడానికి అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే. ఎవరినైతే ప్రేమిస్తారో వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. భాగస్వామి భావాలను కూడా అర్థం చేసుకుంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా మనం అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి జీవితంలో జరగనున్న విషయాల గురించి కూడా చెప్పడానికి అవుతుంది.

తేదీల్లో పుట్టిన వారు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. భాగస్వామి భావాలను కూడా అర్థం చేసుకుంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలోకి వస్తే అదృష్టమే

న్యూమరాలజీ ప్రకారం 5,14,23 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 5 అవుతుంది. బుధుడు ఈ సంఖ్యకు అధిపతి. తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడు.

రాడిక్స్ నెంబర్ 5

రాడిక్స్ నెంబర్ 5 వారు చాలా తెలివితేటలని కలిగి ఉంటారు. పరిస్థితులకి తగ్గట్టుగా సులువుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులను సులువుగా ఆకట్టుకోగలరు. వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి.

వ్యాపారంలో సక్సెస్

రాడిక్స్ నెంబర్ 5 వారు వ్యాపారంలో సులువుగా సక్సెస్ అవుతారు. రిస్క్ తీసుకోవడానికి కూడా ఏ మాత్రం ఆలోచించరు. కొత్త కొత్త పద్ధతుల్లో లాభాన్ని పొందాలని చూసుకుంటారు. ఇతరులని ఆకట్టుకుంటారు. ఇతరులని ఆకట్టుకోవడం కూడా వీరికి పెద్ద కష్టం కాదు. ఈ సంఖ్యల వారు వారి ఆలోచనలతో, తెలివితేటలతో ఇతరులని సులువుగా ఆకట్టుకోగలరు.

ప్రేమ జీవితం

రాడిక్స్ నెంబర్ 5 వారు ప్రేమ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ఎమోషనల్ గా ఉంటారు. ప్రేమలో పడినా సరే వెంటనే ఆ విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి చెప్పరు. చాలా సమయం తీసుకుంటారు. కానీ ఎవరినైతే ప్రేమిస్తారో వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. భాగస్వామి భావాలను కూడా అర్థం చేసుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.