న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలని చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా పుట్టుకతోనే ఉంటాయి. వీరికి సంబంధించి ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఏదైనా నెలలో 9,18, 27 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. రాడిక్స్ నెంబర్ 9 చాలా ప్రభావితమైనది. ఈ సంఖ్య కుజ గ్రహంతో ముడిపడి ఉంది. ధైర్యం, శక్తి, నాయకత్వానికి చిహ్నం. ఈ వ్యక్తులు పోరాటపటిమ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టరు. రాడిక్స్ నెంబర్ 9 వారు దృఢమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు. కష్టపడి పని చేసి, జీవితంలో ముందుకు వెళ్తారు. సహజమైన నాయకత్వ సామర్థ్యం ఉంది. ఇది అందరి నుంచి వారిని భిన్నంగా చేస్తుంది. వీళ్ళు ఏ రంగంలో అయినా తమదైన ముద్ర వేసుకుంటారు.
నెంబర్ 9 వారు పుట్టుకతోనే గొప్ప నాయకులు. ఆత్మవిశ్వాసం, నిర్ణయాధికారం, కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండే వీరి స్వభావం ఎప్పుడూ కూడా మంచి నాయకుడిగా మారుస్తుంది. ప్రజలు కూడా వారి ఆలోచనలను, నిర్ణయాలను గౌరవిస్తారు. ప్రేరేపించడమే కాదు మార్గదర్శక పాత్రను కూడా పోషిస్తారు.
తొమ్మిదిని కుజుడు పాలిస్తాడు. వీళ్ళు ఎప్పుడూ ధైర్యం, శక్తి ఉత్సాహంతో ఉంటారు. ఎలాంటి సవాలుకి కూడా భయపడరు. ధైర్యంగా ఉంటారు. పుట్టినప్పటి నుంచి యోధులలో ఉన్న స్ఫూర్తి వీరికి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముందుకు సాగుతారు.
ఎప్పుడూ కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు బాధ్యత గానే ఉంటారు. పని చేసేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం ఉండదు. చిన్న పనైనా పెద్ద పనైనా బాధ్యతతో నిర్వహిస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులకు సహాయం చేస్తారు. వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పించుకుని పారిపోరు. వారికి ఏది అనిపిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నెంబర్ 1 వారితో బాగా కలిసిపోగలరు. సంఖ్య ఒకటికి అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యల వారితో సమన్వయం బాగా కుదురుతుంది. రాడిక్స్ నెంబర్ 6 వారితో కూడా సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్