న్యాయాధిపతి శని దేవుడు వారి కర్మల ప్రకారం ఫలితాలని ఇస్తాడు. జ్యోతిషశాస్త్రం, సంఖ్య శాస్త్రం గురించి అందరికీ తెలుసు. న్యూమరాలజీ జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరికి శని దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, ఎలాంటి సమస్యలు వచ్చినా తొలగిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారు సంతోషంగా జీవిస్తారు. ఏ ఇబ్బందులు వచ్చినా సరే, శని ఆశీర్వాదంతో తొలగిపోతాయి. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి.
శనీశ్వరుడు, 8 సంఖ్యకు అధిపతి. జనని తేదీని బట్టి రాడిక్స్ నెంబర్ ని తెలుసుకోవచ్చు. ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. వీరికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులు ఇస్తాడు.
న్యాయాధిపతి శనీశ్వరుడు ఎనిమిదవ సంఖ్యకి అధిపతి. ఈ సంఖ్య ఉన్నవారు చురుకుగా ఉంటారు. ఏ పనినైనా సరే, తొందరగా పూర్తి చేస్తారు. ప్రతి పనిని కూడా వారి రీతిలో చేసేస్తారు. అందరికంటే భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. శని మద్దతు ఎప్పుడూ ఈ తేదీల్లో పుట్టిన వారికి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.