ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. దీనితో డబ్బుకు లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు!-people who born on these dates will have lakshmi devi blessings and will be happy with money says numerology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. దీనితో డబ్బుకు లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు!

ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. దీనితో డబ్బుకు లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు!

Peddinti Sravya HT Telugu

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మరి మీరు కూడా వీరిలో ఒకరేమో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులకు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.

మరి మీరు కూడా వీరిలో ఒకరేమో తెలుసుకోండి. రాడిక్స్ నెంబర్ 6 వారితో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

రాడిక్స్ సంఖ్య 6

న్యూమరాలజీ ప్రకారం, ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడు డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి వారిని విడిచిపెట్టి ఎప్పుడూ వెళ్ళిపోదు.

శుక్రుడు అధిపతి:

రాడిక్స్ నంబర్ 6 కి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం వంటి వాటికి శుక్రుడు కారకుడు. లక్ష్మీదేవికి సంఖ్య అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆరు సంఖ్యల వారికి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉంటారు. డబ్బు, ఆస్తులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

నిజాయితీగా ఉంటారు

పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. అనుకున్న దానిని పూర్తి చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, వాటిని వెంటనే పరిష్కరించగలరు.

కళలు, సంగీతం

రాడిక్స్ నెంబర్ 6 వారు మంచి పేరు తెచ్చుకుంటారు. వీళ్ళు చాలా క్రియేటివ్ కూడా. కళలు, సంగీతం, ఫ్యాషన్ వంటి వాటిలో రాణించగలరు. శుక్రుడి ప్రభావం ఉండడం వలన ఈ తేదీల్లో పుట్టిన వారు రొమాంటిక్‌గా ఉంటారు. వీరి మాటలకు ఇతరులు సులభంగా ఆకర్షితులవుతారు.

వీరికి స్నేహితులు కూడా ఎక్కువే. ఇతరులను కూడా అర్థం చేసుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరుల బాధలను అర్థం చేసుకుని, పరిష్కరించగలరు. ధనం ఉన్నప్పటికీ వీరికి గర్వం ఉండదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.