న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. కొన్ని సంఖ్యల వారికి అదృష్టం కలిసి వస్తే, కొన్ని సంఖ్యల వారికి అంత త్వరగా అదృష్టం రాదు.
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి వారి వెంట ఉండడంతో డబ్బుకి లోటు ఉండదు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే త్వరగా తీరిపోతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో సిరి సంపదలు ఉంటాయి. వీరు చాలా అదృష్టవంతులు కూడా, ఎల్లప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. ఒకవేళ పేదరికంలో పుట్టినా సరే, డబ్బుకి లోటు ఉండదు. ఎప్పుడూ డబ్బుతో సంతోషంగా ఉంటారు.
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. రాడిక్స్ నెంబర్ 5కి అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, డబ్బు వంటి వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విజయాలను కూడా అందుకుంటారు.
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. రాడిక్స్ నెంబర్ 6కి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంతోషాలు, విలాసాలు, డబ్బు వంటి వాటికి కారకుడు. శుక్రుడు అనుగ్రహం ఉంటే సంతోషంగా ఉండొచ్చు. సిరి సంపదలకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బు ఉంటుంది.
ఆర్థికపరంగా ఏ బాధలు ఉండవు. సక్సెస్‌ని అందుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో బాధలే ఉండవు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్