ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తూనే ఉంటుంది. రాశుల ఆధారంగా మనం ఎలా అయితే భవిష్యత్తును తెలుసుకుంటాము, న్యూమరాలజీ ఆధారంగా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. దానితో పాటు ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది న్యూమరాలజీ ద్వారా చెప్పవచ్చు.
ఈరోజు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మనం పుట్టిన తేదీ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.
న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటికి ఏదైనా గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ గ్రహం వలన మనిషిపై ప్రభావం పడుతుంది. వారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రవర్తన కూడా గ్రహాల ఆధారంగా ఉంటుంది.
న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య రెండు అవుతుంది. ఈ సంఖ్యలకు అధిపతి చంద్రుడు.
రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా కష్టపడి పని చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రుని ప్రభావం ఉండడం వలన మీరు కాస్త సెంటిమెంటల్‌గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, ఈ తేదీల్లో పుట్టిన వారు భక్తితో ఉంటారు. వారికి భగవంతునితో మంచి అటాచ్మెంట్ ఉంటుంది. హృదయంతో కనెక్ట్ అయి ఉంటారు. కష్టపడతారు, నిజాయితీపరులు.
న్యూమరాలజీ ప్రకారం రెండు సంఖ్య వారు ఎంతో కష్టపడి పని చేస్తారు, నిజాయితీగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు కష్టాల్లో ఉంటే చూడలేరు.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంతో కష్టపడి పని చేస్తారు. పైగా ఎప్పుడూ కూడా నిజాయితీతో ఉంటారు. ఏ ఫీల్డ్‌లో వారు అడుగుపెట్టినా కష్టపడి పనిచేస్తారు. నిజాయితీగా పని చేస్తారు. పని ప్రదేశంలో కూడా ఇతరులకు హెల్ప్ చేస్తారు. శివుని అనుగ్రహం ఉండడం వలన ఎల్లప్పుడూ కష్టాల నుంచి సులువుగా బయటపడతారు. మంచి నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్