ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు, జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు!-people who born on these dates are very lucky and they earn lot check whether you are one among them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు, జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు!

ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు, జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు!

Peddinti Sravya HT Telugu

సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్య ప్రకారం రాడిక్స్ ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొందరికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వారి జీవితం సంతోషాలతోనే గడిచిపోతుంది. ఏ సంఖ్యల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.

ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు

న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ సహాయంతో, వారి లక్షణాలు, ప్రవర్తన గురించి అనేక విషయాలను అంచనా వేయవచ్చు. ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే, సంఖ్యా శాస్త్రంలో ప్రతి సంఖ్య ప్రకారం రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. ప్రతి రాశి ఏదో ఒక గ్రహానికి సంబంధించినది. అలాగే ప్రతీ సంఖ్యకు కూడా ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీని యూనిట్ అంకెకు జోడించండి. అప్పుడు వచ్చే నంబర్ మీ రాడిక్స్ అవుతుంది. అదే సమయంలో, మీరు మీ పుట్టిన తేదీ, నెల మరియు సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేసినప్పుడు, అప్పుడు వచ్చే నంబర్ ని ఫార్చ్యూన్ నంబర్ అని పిలుస్తారు. ఉదాహరణకు, 6, 15 మరియు 24 తేదీలలో జన్మించిన వ్యక్తులకు రాడిక్స్ 6 (6+0=1+5=2+4=6) ఉంటుంది.

న్యూమరాలజీ ప్రకారం కొందరికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అలాంటి వారి జీవితం సంతోషాలతోనే గడిచిపోతుంది. ఈరోజు ఏ సంఖ్యల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.

సంఖ్య 2:

సంఖ్యాశాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి నెంబరు 2 వ్యక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది. వీరిలో ప్రతిభకు కొదవలేదు. వీరి ప్రసంగంలోని మాధుర్యానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి. వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఎప్పుడూ అందరి మనసులు గెలుచుకుంటారు.

సంఖ్య 6:

సంఖ్యాశాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి 6 వ సంఖ్య వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది. వీరు తమ కృషి, వినూత్న ఆలోచనలతో విజయాలను అధిరోహిస్తారు. ఈ వ్యక్తులు తాము అనుకున్న పనిని ఎన్నడూ విడిచిపెట్టరు. వారి నిర్ణయాధికారం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు జీవితంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. కష్టాలకు ఎప్పుడూ భయపడరు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.