ప్రతి ఒక్కరూ కూడా వారికి అన్నీ వచ్చి ఉండాలని అనుకుంటారు, అన్నిటిలో పర్ఫెక్ట్‌గా ఉండాలని, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలని అనుకుంటారు. కానీ అందరికీ అన్నీ రావు. కొంత మంది మాత్రమే అన్నిట్లో ముందుంటారు. డాన్స్, సింగింగ్ ఇలా అన్నిట్లో కూడా ముందు ఉండే వారు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. దాంతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్నిట్లో కూడా వారి హవా చూపిస్తూ ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అయితే, అన్నిట్లో కచ్చితంగా ముందుంటారు.
న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. వీరికి రానిది అంటూ ఏమీ ఉండదు, అన్నిట్లో ముందుంటారు. మరి వారిలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు. చూసుకోండి, ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ టాలెంటెడ్‌గా అన్నిట్లో వాళ్ల హవా చూపిస్తారు.
ఐదవ తేదీన పుట్టిన వారు ఏ విషయాన్నైనా ఆసక్తితో నేర్చుకుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఏ ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగలరు. ప్రతి అనుభవం నుండి కొత్త పాఠం నేర్చుకుని జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటారు. చురుకుగా ఉంటారు, ఎక్కువ మందితో స్నేహం చేస్తూ ఉంటారు, అందరితో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వీరికి తెలియనిది ఏమీ ఉండదు. ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుని ఉద్యోగం చేస్తున్నా, మిగతా రంగాల్లో కూడా వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది.
14వ తేదీన పుట్టిన వారు కూడా మల్టీ టాలెంటెడ్. వీరికి అన్నీ వచ్చు. మల్టీ టాలెంటెడ్‌గా చూపిస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఏమైనా సమస్య వచ్చినప్పుడు దానిని విశ్లేషించి పరిష్కారాలను కనుగొంటారు. భవిష్యత్తు గురించి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులు పెట్టుబడి పెట్టకపోయినా, వీరే పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తారు. ఎల్లప్పుడూ తమ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలని అనుకుంటారు.
21వ తేదీన పుట్టిన వారు డైనమిక్ అని చెప్పొచ్చు. వీరికి మీద శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివైన వారు, కొత్త విషయాలను సులువుగా అన్వేషిస్తారు. కొత్త వాటిని ఈజీగా స్వీకరిస్తారు. మీరు కూడా మల్టీ టాలెంటెడ్, కలలు, కమ్యూనికేషన్ రంగంలో బాగా రాణిస్తారు. వ్యాపారంలో కూడా ఈజీగా సక్సెస్ అవుతారు. వారి అనుభవాలతో జీవితాన్ని బలంగా నిర్మించుకోగలరు.
ఏదైనా నెలలో 23వ తేదీన పుట్టిన వారు ఆకర్షణీయంగా ఉంటారు. వేటినైనా సులువుగా అర్థం చేసుకుంటారు. లేని విషయాన్ని ఈజీగా తెలుసుకుంటారు. చురుకుగా ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మార్కెటింగ్, టెక్నాలజీ, మ్యూజిక్ లాంటి రంగాల్లో బాగా రాణిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్