న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు.. ఇతరులను కూడా ఈజీగా ఆకట్టుకుంటారు!-people who born on these dates are intelligent says numerology check whether you are one among them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు.. ఇతరులను కూడా ఈజీగా ఆకట్టుకుంటారు!

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు.. ఇతరులను కూడా ఈజీగా ఆకట్టుకుంటారు!

Peddinti Sravya HT Telugu

సంఖ్యల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వీటి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. పైగా ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు, వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. పైగా, వారి వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది.

సంఖ్యలు, రహస్యాలు

సంఖ్యల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వీటి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. సులువుగా ఆకట్టుకోవడం, తెలివితేటలు కలిగి ఉండడం వంటివి ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

రాడిక్స్ నెంబర్ 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. కేతువు ఈ సంఖ్యను పరిపాలిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బయట చూడడానికి చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారు. ఆలోచనలు ఉంటాయి, ఓపెన్‌గా వీరి భావాలను బయటపెడతారు. పైకి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడూ కూడా అందరి నుంచి దూరంగా ఉంటారు.

ఈజీగా ఆకట్టుకుంటారు

వీరి ఆలోచనలను కానీ, వీరు ప్రవర్తించే తీరు కానీ ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పైగా, ఇతరుల కంటే మీరు కొంచెం స్పెషల్‌గా కనిపిస్తారు. ఇతరులను ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ కూడా ఎక్కువే. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ క్రియేటివిటీని కలిగి ఉంటారు. మ్యూజిక్, రైటింగ్, పెయింటింగ్, నటన వంటి క్రియేటివ్ ఫీల్డ్స్‌లో సెటిల్ అవుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.