కేతువు నీడ గ్రహం. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఊహించని మార్పులు, మానసిక సంఘర్షణలు, ఆధ్యాత్మిక అవగాహనని తీసుకొస్తుంది. ఏడవ సంఖ్యకు అధిపతి కేతువు. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో రహస్యమైన గ్రహం కేతువు. కేతువు జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి, లోతైన ఆలోచనలు, మానసిక ప్రశాంతతను ప్రేరేపిస్తుంది. దీంతో జీవితాన్ని లోతుగా, సానుకూల దశ వైపు మార్చుకోవచ్చు. ఏడవ సంఖ్య పై కేతువు ప్రభావం ఎంతో లోతుగా ఉంటుంది.
ఏదైనా నెలలో 7,16, 25వ తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. ఏడవ సంఖ్య వారిపై కేతువు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కేతువు ప్రభావం వలన 7 సంఖ్య వారు మానసికంగా విశ్లేషణాత్మకంగా, ఆలోచనత్మకంగా, లోతైన ఆలోచనపరులుగా ఉంటారు. ఎప్పుడూ కూడా అంతర్గత ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి చూస్తారు. జీవితంలోని రహస్యాలని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది.
జీవితంలో స్వీయ నియంత్రణ, ధ్యానం ప్రాముఖ్యతను వీరు తెలుసుకుంటారు. కేతువు ప్రభావంతో ఈ సంఖ్యల వారు మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. జీవితంలో భౌతిక అంశాల కంటే ఆత్మ, మానసిక శాంతి పై ఎక్కువ శ్రద్ధ పెడతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.