హిందూమతంలో ప్రతీ నెలకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ నెలలో కూడా కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. ఒక్కో నెలలో ఒక్కో విధంగా పూజలు, జీవనశైలి మొదలైన వాటికి సంబంధించిన నియమాలు ఉంటాయి. ప్రతి నెలలో పుట్టిన వ్యక్తికి కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. మనిషి పుట్టిన నెల ఆధారంగా వారు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది?
ప్రేమ జీవితము, కెరీర్ ఇలా చాలా వాటి గురించి చెప్పవచ్చు. తెలుగు నెలలలో మూడవ నెల అయినటువంటి జ్యేష్ఠ మాసంలో పుడితే వారు ఎలా ఉంటారు, వారి కెరీర్ తో పాటు అనేక విషయాలను తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారికి విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరి ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. ఇతరులకు ఎటువంటి హాని కలిగించాలని అనుకోరు. నిజాయితీతో వ్యవహరిస్తారు. తెలివిని, జ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే, వీరు విజయాలను అందుకోవచ్చు. త్వరగా ధనవంతులు కూడా అయిపోవచ్చు. విదేశాలకు వెళ్లొచ్చు.
ఈ మాసంలో పుట్టిన వారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇతర దేశాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి.
జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారు ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తరవాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు.
జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు కూడా చాలా స్పెషల్. జ్యోతిష్యంలో జ్యేష్ఠ నక్షత్రం వారి సంఖ్య పద్దెనిమిది. జ్యేష్ఠ అంటే పెద్దది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు త్వరగా సక్సెస్ ని అందుకుంటారు. వీరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎప్పుడూ నెంబర్ వన్ లో ఉండాలని అనుకుంటారు. చీఫ్ మేనేజర్, సీఈఓ, కెప్టెన్, కమాండర్, నాయకులుగా మారతారు. ఇంజనీరింగ్, పోలీస్, డిఫెన్స్ లో కూడా బాగా రాణించగలరు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.