November: నవంబర్ లో పుట్టిన వాళ్ళు ప్రేమించిన వారికి ద్రోహం చేయరు-కానీ అదొక్కటే వీరి మైనస్
November: క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెల పదకొండవది. ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వ్యక్తిత్వం ఏంటి? వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది? వీరి ప్రతికూల, సానుకూల విషయాలు ఏంటో తెలుసుకుందాం.
నవంబర్ నెల ప్రారంభమైంది. దీపావళి పండుగతో అందరూ కొత్త నెలకు స్వాగతం పలికారు. నవంబర్ అనేది లాటిన్ పదం నవమ్ నుంచి వచ్చింది. రోమన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో తొమ్మిదవ నెల. పాత రోమన్ క్యాలెండర్ ప్రకారం పది నెలలు మాత్రమే ఉన్నాయి. కానీ తర్వాత పన్నెండు నెలలు కాగా పదకొండవ నెలగా మారింది.
కెరీర్ ఎలా ఉంటుందంటే
నవంబర్ నెలలో జన్మించిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ నెల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ నెలలో పుట్టిన వారికి కొన్ని ఆకర్షణీయమైన లక్షణాలు ఉంటాయి. వీరి ఆశయం, సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. నవంబర్ లో జన్మించిన వ్యక్తులు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇది వారి జీవితంలో వచ్చే సమస్యలు, ప్రతికూలతలను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. పనికి కట్టుబడి ఉంటారు. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు.
ఈ నెలలో పుట్టిన వాళ్ళు తమ విషయాలను ఎక్కువగా రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు. తమ వస్తువులు, ఆలోచనలు, భావోద్వేగాలు ఇలా అన్నింటినీ దాచి పెట్టుకుంటారు. అది బయట వ్యక్తుల దగ్గర మాత్రమే కాదు కుటుంబ సభ్యుల దగ్గర కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఈ స్వభావం కారణంగానే వీళ్ళని అర్థం చేసుకోవడం సవాలుగా మారుతుంది. అయితే ఎంతటి కష్టమైన సవాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఏదైనా విషయం నేర్చుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు.
అదొక్కటే మైనస్
ఎంతటి సవాలు అయినా సరే వారి తెలివితేటలతో నైపుణ్యంగా వ్యవహరిస్తారు. ఒక విషయం గురించి చాలా విశ్లేషిస్తారు. జీవితంలో తమ లక్ష్యాలు సాధించడం కోసం, విజయాన్ని చేరుకునేందుకు ఎంతటి కృషి అయినా చేస్తారు. ఇతరులను విజయం వైపు నడిపించేందుకు సహాయం చేస్తారు. కఠినమైన పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం వీరి సొంతం.
నవంబర్ లో పుట్టిన వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొన్ని సార్లు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. జీవితంలో విజయం సాధించేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మునడుంటారు. కష్టపడి, తమ ప్రతిభ ద్వారా లక్ష్యాలను సాధిస్తారు. ఇతరుల సహాయం తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఎవరైనా వీరికి సలహా ఇస్తే మెచ్చుకోకపోగా విమర్శిస్తారు. ఇదే వీరిలో ఉంటే ప్రతికూల స్వభావం.
ప్రేమ పరంగా ఈ నెలలో పుట్టిన వాళ్ళు తమ భాగస్వాములకు విధేయులుగా ఉంటారు. తమ బంధాన్ని నిజాయితీగా, నిబద్ధతతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఎప్పటికీ ద్రోహం చేయరు. మంచి స్నేహితులుగా ఉంటారు. అలాగే స్నేహితులకు కూడా ఎప్పటికీ ద్రోహం చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఈ నెలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 1, 3, 7.
పరిహారం
నవంబర్ లో పుట్టిన వారికి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు ఒక చిన్న పరిహారం పాటిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ నూనెను ఆలయంలో దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్