వాస్తు ప్రకారం చాలా మంది ఇంట్లో కొన్ని వస్తువులని పెడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లల్లో నెమలి విగ్రహాలు కూడా ఉంటాయి. నెమలి విగ్రహాలు ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి లాభాలు కలుగుతాయి?, వాటిని ఏ దిశలో ఉంచాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన సాంప్రదాయంలో నెమలికి ఎంతో ప్రత్యేకత ఉంది. నెమలిని అదృష్టంగా భావిస్తారు. సంపదకి చిహ్నం. నెమలి ఇంట్లో ఉండడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. నెమలిని ఏ దిశలో ఉంచాలి?, ఎటువంటి నెమలిని ఉంచితే మంచిది అనేది తెలుసుకుందాం.
ఇంట్లో నెమలి విగ్రహం ఉండడం వలన అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంపద పెరుగుతుంది. నెమలి శివుడు కొడుకు కార్తికేయుడి వాహనం. నెమలి జ్ఞానం, శక్తి, భద్రతకి చిహ్నంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో కూడా ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మార్చడమే కాదు సానుకూల శక్తిని కలిగించి, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
ఇంట్లో నెమలి విగ్రహాన్ని పెట్టేటప్పుడు వెండితో చేసిన నెమలి విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం. వెండి చాలా పవిత్రమైన లోహం. ఇది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ప్రతికూలతను తొలగిస్తుంది.
నెమలి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలని విషయానికి వస్తే.. ఈశాన్యం వైపు ఉంచడం మంచిది. ఈ దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి శ్రేయస్సుని తీసుకు వస్తుంది. సంపద పెరుగుదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నెమలి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు నెమలి నృత్యం చేస్తునట్టు లేదా కదిలే స్థితిలో ఉండే విగ్రహాన్ని కొనుగోలు చేస్తే మంచిది. ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది.
ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచడం వలన ఆర్థిక సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా వెండి విగ్రహాన్ని ఉంచితే ధనం పెరుగుతుంది. సంతోషం కూడా కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం