చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా కూడా ఉండవచ్చు. వాస్తు ప్రకారం కొన్ని పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. వాస్తు దోషాలు. సమస్యలు కూడా తొలగిపోతాయి. రామ చిలుకలు చూడడానికి అందంగా కనపడతాయి.
అంతేకాకుండా రామ చిలుకలు కొన్ని సమస్యలను కూడా తగ్గించగలవు. వాస్తు ప్రకారం రామ చిలుకలు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. వీటి ఆకుపచ్చ రంగు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శాంతి, తాజాదనానికి ఇది చిహ్నం. ఇంట్లో సమస్యలు, ఒత్తిడిని తగ్గించడానికి చిలుక ఎంతగానో ఉపయోగపడుతుంది. సామరస్యాన్ని పెంచుతుంది.
చిలుక ప్రధానంగా కమ్యూనికేషన్, విద్యకి ప్రసిద్ధి. వాస్తు విశ్వాసాల ప్రకారం పిల్లలు మాట్లాడే సామర్థ్యాన్ని, చదువుపై ఆసక్తిని, భావవ్యక్తీకరణ శక్తిని కూడా చిలుక పెంచుతుంది. పిల్లల గదిలో చిలుక బొమ్మ లేదా చిలుక పంజరం ఉండడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. వారి సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
చిలుక ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నైరుతి వైపు చిలుక చిత్రాన్ని లేదా చిలుక బొమ్మని ఉంచితే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులు ప్రేమలో సక్సెస్ అవ్వచ్చు.
చిలుకను ఇంట్లో పెట్టేటప్పుడు ఈశాన్యం ఉత్తమ దిశ. ఈ దిశలో చిలుక ఉన్నట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఒకవేళ ఈశాన్యం వైపు కుదరకపోతే తూర్పు వైపు పెట్టొచ్చు. దక్షిణం, నైరుతి దిశల్లో మాత్రం పెట్టకండి. ఈ దిశలో పెడితే జీవితంలో ఆటంకాలు, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
ఒకటి లేదా రెండు చిలుకలు కానీ ఫోటోని కానీ ఇంట్లో పెట్టవచ్చు. రెండు చిలుకలు ఉంటే ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. ఎక్కువ చిలుకలు ఉన్న ఫోటోలను పెట్టడం వలన ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.