Palmistry: చేతిపై ఇలా గీతలు ఉంటే ప్రేమలో మోసపోతారు, ప్రేమకథ అసంపూర్ణంగా మిగిలిపోతుంది
Palmistry: మన చేతిలో ఉన్న గీతలు చాలా విషయాల్ని చెప్తూ ఉంటాయి. హస్త సాముద్రకం ప్రకారం ప్రతి వ్యక్తి చేతిలో విధి రేఖ, ఆరోగ్య, వైవాహిక, జీవిత రేఖ ఇలా ఉంటాయి. ప్రతీ ఒక్కరి చేతి పై వుండే ప్రత్యేక గీత గురించి ఈరోజు తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, మనం జీవితంలో ఎంత దాకా విజయాన్ని సాధిస్తాము, కెరీర్, వివాహం ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడతాయి. మన చేతిలో ఉన్న రేఖలు చాలా విషయాల్ని చెప్తూ ఉంటాయి. హస్త సాముద్రకం ప్రకారం ప్రతి వ్యక్తి చేతిలో విధి రేఖ, ఆరోగ్య, వైవాహిక, జీవిత రేఖ ఇలా ఉంటాయి.
ఈ నాలుగు లైన్లను విశ్లేషిస్తే వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రతీ ఒక్కరి చేతి పై వుండే ప్రత్యేక గీత గురించి ఈరోజు తెలుసుకుందాం. వీటిని చూసి ప్రేమ, వివాహం పరంగా ఒక వ్యక్తి ఎంతవరకు విజయవంతం అవుతారు అనేది తెలుసుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి రేఖ
- చిటికెన వేలు కింద కనపడే రేఖల్ని వివాహ రేఖలు లేదా ప్రేమ రేఖలు అని అంటారు. ఇవి వ్యక్తి యొక్క ప్రేమ, వివాహ జీవితాన్ని సూచిస్తాయి. మీ ప్రేమ జీవితం ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్తాయి. ఇలా ప్రేమ గురించి, పెళ్లి గురించి ఈ రేఖలు ద్వారా తెలుసుకోవచ్చు.
- అరచేతిలో బుధుడు, కుజుడుకి సంబంధించిన రేఖలు ఉంటే సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారి ప్రేమ కథ అసంపూర్ణంగా ఉండిపోయి విడిపోవలసి ఉంటుంది.
- ఇంకో పక్క అరచేతిలో హార్ట్ లైన్ కొద్దిగా వంపు తిరిగి ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తులు ప్రేమలో మోసపోవచ్చు.
- హస్త సాముద్రకం ప్రకారం హార్ట్ లైన్ మధ్యలో లేనట్లయితే ప్రేమ కథ ముగిసిపోతుంది. పెళ్లి వరకు వారి రిలేషన్షిప్ వెళ్ళదు. ఇలాంటివారు రిలేషన్ కి సంబంధించి ఎమోషనల్ గా ఉంటారు.
పెళ్లి గీత
జ్యోతిష్యులు చెప్తున్న దాని ప్రకారం అరచేతిలో వివాహ రేఖ తొలగిపోయి ఉంటే ప్రేమ సంబంధంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు జీవిత భాగస్వామికి దగ్గరగా ఉంటారు, కొన్ని సార్లు దూరంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వ్యక్తులు ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.