అదృష్టవంతులకు మాత్రమే ఈ 5 భాగాలలో పుట్టుమచ్చలు ఉంటాయి.. అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు!-only lucky people have moles at these 5 places and they lead happy and luxurious life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అదృష్టవంతులకు మాత్రమే ఈ 5 భాగాలలో పుట్టుమచ్చలు ఉంటాయి.. అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు!

అదృష్టవంతులకు మాత్రమే ఈ 5 భాగాలలో పుట్టుమచ్చలు ఉంటాయి.. అందుకే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు!

Peddinti Sravya HT Telugu

పుట్టుమచ్చల వలన కేవలం అందం పెరగడమే కాకుండా, విధి, కర్మలతో కూడా లోతైన సంబంధం ఉంటుంది. శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి వారు జీవితంలో సంపద, విజయం, గౌరవం, సంతోషం పొందుతారు. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే లక్కీ. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

అదృష్టవంతులకు మాత్రమే ఈ 5 భాగాలలో పుట్టుమచ్చలు ఉంటాయి (pinterest)

జ్యోతిష శాస్త్రంలో పుట్టుమచ్చలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పుట్టుమచ్చలు వ్యక్తి భవిష్యత్తు, స్వభావానికి సంకేతంగా పరిగణించబడతాయి. పుట్టుమచ్చల వలన కేవలం అందం పెరగడమే కాకుండా, విధి, కర్మలతో కూడా లోతైన సంబంధం ఉంటుంది. శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా భావిస్తారు.

అలాంటి వారు జీవితంలో సంపద, విజయం, గౌరవం, సంతోషం పొందుతారు. పురాణాలు మరియు సాముద్రిక శాస్త్రాల్లో కూడా ఈ విషయాల గురించి ప్రస్తావించబడింది. ఇప్పుడు శరీరంలోని ముఖ్యమైన భాగాలలో పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు ఎలా అదృష్టవంతులవుతారో తెలుసుకుందాం.

ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే లక్కీ

1. నుదుటిపై పుట్టుమచ్చ:

సాముద్రిక శాస్త్రం ప్రకారం, నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. వీరు చాలా తెలివైనవారు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు, అదృష్టం వీరి వెంట ఉంటుందన్నది చెప్పవచ్చు.

2. కుడి అరచేతిపై పుట్టుమచ్చ:

కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. సాముద్రిక శాస్త్రం ప్రకారం, వీరు డబ్బు కొరతను ఎదుర్కొనరు. కష్టపడి పని చేస్తారు, మంచి వ్యాపారవేత్తలు, అధికారులు అవుతారు. ఆర్థికంగా నిలకడగా ఉండి, ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది.

3. మెడపై పుట్టుమచ్చ:

మెడపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలతో మెరుగైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరులను ఆకర్షించగలరు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరి జీవితం సంతోషకరంగా ఉంటుంది.

4. అరికాళ్ళపై పుట్టుమచ్చ:

సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరికాళ్ళపై పుట్టుమచ్చ ఉండటం శుభప్రదం. అలాంటి వ్యక్తులు ప్రయాణాలను ఇష్టపడతారు, దేశ విదేశాల్లో విహారాలు చేస్తారు. తెలివితేటలు ఎక్కువగా ఉండి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది.

5. నాభి దగ్గర పుట్టుమచ్చ:

నాభి ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది సంపద, విలాసానికి సంకేతంగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు జీవితం మొత్తాన్ని విలాసవంతంగా గడుపుతారు. సంతోషంగా వుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.