ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటారు, కానీ దానిని పొందడం సులభం కాదు. శాంతిని పొందాలంటే, మనం ఇతరులను క్షమించగలగాలి. క్షమాగుణం, కరుణ శాంతిని తెస్తాయి. క్షమిస్తే కరుణ వస్తుంది, కరుణ నుండి శాంతి వస్తుంది.
మనమంతా ఒకే కుటుంబం అని, ఈ ప్రపంచంలో శాంతి ఉంటుందని అర్థం చేసుకోవడం, గ్రహించడంపైనే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈ శాంతి ఎలా వస్తుంది? శాంతికి మొదటి మెట్టు క్షమాగుణం. మన లోకంలో శాంతిని సాధించాలంటే గతాన్ని మరచిపోయి మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం నేర్చుకోవాలి.
మనం ప్రతీకార స్ఫూర్తిని క్షమాగుణం, కరుణతో భర్తీ చేయాలి. కోపాన్ని, ద్వేషాన్ని మనమే ప్రక్షాళన చేసుకుని దాని స్థానంలో ప్రేమ, క్షమాగుణం నింపాలి. దీన్ని మనం ఎలా సాధించగలం? శతాబ్దాలుగా పని చేస్తున్న ఒక పరిష్కారాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఆధ్యాత్మికత ద్వారా కరుణ, క్షమాగుణం, శాంతిని పొందవచ్చు.
మన నిజస్వరూపం మన ఆత్మ. మన ఆత్మ భగవంతునితో ఏకమైందనేది విశ్వాసం. మనం కేవలం శరీరం, మనస్సు మాత్రమే కాదని, మన శరీరంలో నివసిస్తున్న ఆత్మ అని గ్రహించాలి. మనల్ని మనం ఒక పేరున్న సంస్థగా లేదా ఫలానా దేశ పౌరులుగా భావించవచ్చు. కానీ వీటి వెనుక మనమందరం ఆత్మలు, ఒకే సృష్టికర్తలో భాగమని మనం గుర్తించాలి.
అందువల్ల మనమందరం ఒక కుటుంబ సభ్యులు. ఈ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, ఒక వ్యక్తిని మరొకరి నుండి వేరు చేసే అడ్డంకులను మనం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాము. మనమందరం ఆత్మ స్థాయిలో అనుసంధానించబడ్డామని మనం అనుభూతి చెందడం ప్రారంభిస్తాము. మన ఏకత్వం, అనుసంధానం అనుభవించినప్పుడు, మనం ఒకరినొకరు పట్టించుకోవడం ప్రారంభిస్తాము. ఒకరికొకరు సహాయం, సేవ చేయాలనుకుంటున్నాం.
మ పిల్లల బాధలు మనలను ఎలా బాధ పెడతాయో అందరి బాధలు అలానే ఉంటాయి. వీధిలో బాధలో ఉన్న తెలీని వ్యక్తికీ కూడా సహాయం చేయడానికి ప్రేరణ వస్తుంది. మన దృష్టి విస్తృతమవుతుంది. మనం అందరి మానవుల బాధల పట్ల కరుణ కలిగి ఉంటాము. వారికి సహాయం చేయాలని కోరుకుంటాము. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, మనలో కరుణ పుడుతుంది. ఈ కరుణ మనకు శాంతినిస్తుంది.
ఆధ్యాత్మికంగా మేల్కొనడం ద్వారా మనం దీన్ని చేయవచ్చు. దేవుని అంతర్గత కాంతి, ధ్వనిపై ధ్యానం యొక్క సరళమైన పద్ధతి ద్వారా మన ఆధ్యాత్మిక స్వభావం పట్ల మనం మేల్కొంటాము. ఈ విలోమ ప్రక్రియ ద్వేషాన్ని శుద్ధి చేయడానికి, దాని స్థానంలో ప్రేమ, శాంతిని తీసుకురావడానికి మనకు సహాయపడుతుంది. నిశ్శబ్దంగా కూర్చోవడం, ధ్యానంపై దృష్టి పెట్టడం ద్వారా, మనం మన ఆత్మతో అనుసంధానించబడి, మనలో ఉన్న ప్రేమ, శాంతి, ఆనందాన్ని అనుభవించగలుగుతాము. ఇలా చేయడం ద్వారా మనం ప్రేమతో, దయతో, శాంతితో ఉండగలం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్