Polala Amavasya: పవిత్ర పోలాల అమావాస్య రేపే, మీ పిల్లల క్షేమం కోసం ఈ మొక్కను పూజించండి-on the holy polala amavasya worship the kanda plant for the well being of your children ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Polala Amavasya: పవిత్ర పోలాల అమావాస్య రేపే, మీ పిల్లల క్షేమం కోసం ఈ మొక్కను పూజించండి

Polala Amavasya: పవిత్ర పోలాల అమావాస్య రేపే, మీ పిల్లల క్షేమం కోసం ఈ మొక్కను పూజించండి

Haritha Chappa HT Telugu

Polala Amavasya: సెప్టెంబర్ 2న పోలాల అమావాస్య. దీన్నే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు హిందువులకు ఎంతో ముఖ్యమైనది. శ్రావణమాసంలో చివరి రోజును పోలాలా అమావాస్యగా నిర్వహించుకుంటారు. ఈరోజు ఎలా పూజించాలో తెలుసుకోండి.

పోలాల అమావాస్యరోజు పూజించాల్సిన మొక్క ఇదే

పోలాల అమావాస్య హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. పూర్వీకులను గౌరవించిన పండుగ ఇది. భక్తులు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ రోజున పూజను నిర్వహిస్తారు. సోమావతి అమావాస్యను తెలుగు వారు పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. పోలాల అమావాస్య చేసిన పూజలు ఇంట్లోని పిల్లలకు యోగ క్షేమాలు అందిస్తాయని నమ్మకం. ఎవరికైతే సంతానం లేదో వారు ఈ పండుగను చేయడం వల్ల వారికి పిల్లలు కలిగే అవకాశం ఉందని చెప్పుకుంటారు. మన తెలుగు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 2 తేదీన శ్రావణమాసంలో చివరిరోజైన అమావాస్య వచ్చింది. అదే రోజు కొందరు సోమావతి అమావాస్యను లేదా పోలాల అమావాస్యను నిర్వహించుకుంటారు.

పోలాల అమావాస్య 2024

ఈ సంవత్సరం ముఖ్యమైన హిందూ పండుగ పోలాల అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం నిర్వహించుకోనున్నా. అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోండి.

అమావాస్య తిథి ప్రారంభం - 05:21 AM, సెప్టెంబర్ 2, 2024

అమావాస్య తిథి ముగింపు - ఉదయం 07:24, సెప్టెంబర్ 3, 2024

పూజా సమయం ఎప్పుడు?

అమావాస్య తిథి ఉదయాన్నే మొదలైపోతోంది. కాబట్టి తెల్లవారుజామునే లేచి తలకు స్నానాలు చేసి పూజకు సిద్ధమవ్వాలి. ఈరోజున ఉదయం 6.09 గంటల నుంచి ఉదయం 7.44 గంటల వరకు పూజ చేసుకోవాలి. ఈ అమావాస్య సోమవారం పడింది కనుక దీన్ని చాలా చోట్లా సోమవతి అమావాస్య అని పిలుస్తారు.

పోలాల అమావాస్య 2024 పూజ ఇలా చేయండి

1. ఉదయాన్నే లేచి ముందు స్నానం చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి.

2. మీ పూర్వీకుల గౌరవార్థం పూజగదిలో దీపం వెలిగించడానికి దేశీ నెయ్యిని ఉపయోగించండి.

3. ఈ రోజున సాత్విక వంటకాలను తయారు చేయండి. ఇంట్లో పితృ తర్పణం చేయడానికి పూజారి లేదా బ్రాహ్మణుడిని ఆహ్వానించండి.

4. పూజారి లేదా బ్రాహ్మణుడికి ఆహారం, బట్టలు, దక్షిణ ఇవ్వండి.

5. ఆవులు, కుక్కలు, కాకులు, చీమలు వంటి జంతువులకు ఆహారం పెట్టండి.

6. పితృ పూజ తర్వాత, శివుడు, విష్ణువును ఆరాధించండి. వేద మంత్రాలను పఠించండి.

7. అవసరమైన వారికి డబ్బు, బట్టలు, ఆహారం దానం చేయండి.

పిల్లల కోసం ఈ మొక్కను పూజించండి

మీ పిల్లల యోగక్షేమాల కోసం లేదా సంతానం కోసం శ్రావణ మాసంలో చివరి రోజైన పోలాల అమావాస్య రోజు కంద మొక్కను పూజించాలి. కందమొక్కను అమ్మవారిగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టాలి. అదే తోరం. ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజించాలి. పసుపు, కుంకుమలతో కంద మొక్కను పూజించాలి.