Bhishma Dwadashi : భీష్మ ద్వాదశి రోజున.. భీష్ముడి కథ ఎందుకు వినాలి? నిజంగానే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయా?-on the day of bhishma dwadashi why should listen the story of bhishma ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhishma Dwadashi : భీష్మ ద్వాదశి రోజున.. భీష్ముడి కథ ఎందుకు వినాలి? నిజంగానే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయా?

Bhishma Dwadashi : భీష్మ ద్వాదశి రోజున.. భీష్ముడి కథ ఎందుకు వినాలి? నిజంగానే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయా?

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 10:31 AM IST

Bhishma Dwadashi : భీష్మ ద్వాదశి.. ఎంతో ప్రత్యేకమైన రోజు. భీష్మ ద్వాదశి నాడు భీష్ముడి కథ వినాలని పెద్దలు చెబుతుంటారు. అలాగే భీష్మ ద్వాదశి రోజున పూజలు చేస్తే.. బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భీష్ముడి కథ వింటే నిజంగానే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భీష్మ ద్వాదశి
భీష్మ ద్వాదశి

భీష్మ ద్వాదశి.. ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్మకం. అందుకే ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, విష్ణువు, సూర్యభగవానుడిని పూజిస్తారు. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు, కుశతో తర్పణం చేస్తారు. బ్రాహ్మణులకు ఆహారం, దక్షిణను నైవేద్యం పెడతారు. అంతేకాదు.. పూర్వీకులను కూడా పూజిస్తారు. ఈ రోజున పూజలు చేయడం వల్ల.. వ్యక్తి బాధలు తొలగిపోతాయని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే.. ఈ రోజున భీష్మ కథ వినాలని పెద్దలు చెబుతారు.

శ్రీ భీష్మకుండ్ కథ..

భీష్మ కుండ్ కురుక్షేత్ర థానేసర్‌లోని నర్కటరి వద్ద ఉంది. దీనినే భీష్మపితామహా కుండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ భీష్మ ఆలయం ఉంది. మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు.. అర్జునుడి బాణాల మీద పడుకున్న ప్రదేశం ఇది. భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే.

భీష్ముడు గంగాదేవి కుమారుడు. పరశురాముడి శిష్యుడు. భీష్ముడు ఏ యోధుడు ఓడించలేని శక్తిమంతుడు. భీష్మపితామహుడిని పాండవులు, కౌరవులు గౌరవించారు. కానీ.. మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇచ్చాడు. కొన్ని కారణాల వల్ల కౌరవుల తరఫున మహాభారత యుద్ధంలో ఇష్టం లేకుండా పోరాడవలసి వచ్చింది. అయితే.. పాండవులను చంపనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.

ఈ ప్రమాణానికి పాండవుల పట్ల ఆయనకున్న అభిమానమే కారణం. పురాణాల ప్రకారం.. భీష్ముడు అతను కోరుకున్నంత కాలం జీవించగలడు. అతను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరం ఉంది. పాండవులకి భీష్మ పితామహుడిని ఎదుర్కోవటానికి మార్గం లేదు. అందుకే వారు శ్రీకృష్ణుడిని సలహా అడిగారు. ఎందుకంటే భీష్మ పితామహ మరణ రహస్యం శ్రీకృష్ణుడికే తెలుసు కాబట్టి.

భీష్మ పితామహుడి మరణ రహస్యం.. భీష్ముడినే అడిగి తెలుసుకోవాలని పాండవులకు శ్రీకృష్ణుడు సూచించారు. దీంతో పాండవులు భీషముడి దగ్గరకు వెళ్లి మరణ రహస్యాన్ని అడుగుతారు. అప్పుడు తనను తాను విముక్తి చేసుకోవడానికి.. తనను ఎలా చంపాలో చెబుతాడు భీష్ముడు. శిఖండిని యుద్ధంలో తీసుకురావాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన శిఖండితో యుద్ధం చేయరు.

భీష్ముడి సూచనతో శిఖండిని యుద్ధ క్షేత్రంలోకి తీసుకొస్తారు. అర్జునుడు శిఖండి వెనుక నిలబడి బాణాలు వేస్తాడు. దీంతో భీష్మ పితామహుడు గాయపడి అన్ని ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం పదో రోజున పడిపోతాడు. భీష్మపితామహాను బాణాల మీద పడుకోబెడతారు. కౌరవులు, పాండవులు ఆయన చుట్టూ చేరతారు. అప్పుడు బాణపు శయ్యపై పడుకుని దాహం వేస్తుందని అడగ్గా.. అర్జునుడు బాణం వేస్తాడు.

భీష్ముడు పడుకున్న చోట నుండి నీరు ప్రవహించింది. ఈ నీటి ప్రవాహం మరెవరో కాదు.. తన కొడుకు భీష్ముడి దాహాన్ని తీర్చడానికి భూమి నుండి పైకి లేచిన అతని తల్లి గంగ. భీష్ముడు ఇచ్ఛా మరణ వరంతో సూర్యుడు ఉత్తర అర్ధగోళంలోకి వెళ్లినప్పుడు ఉత్తరాయణంలో మరణించాలని కోరుకున్నాడు. ఉత్తరాయణంలో తుదిశ్వాస విడిచిన వ్యక్తికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని చెబుతారు.

ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని భీష్మకుండ్ అని పిలుస్తారు. భీష్మ పితామహ పేరు మీద ఒక మెట్ల బావి ఉంది. బంగంగా, భీష్మ కుండ్ అని పిలిచే నీటి ట్యాంక్ పక్కన ఆలయం ఉంది. దీనిని తానేసర్‌ భీష్మ నర్కటరి ఆలయం అని పిలుస్తారు. ఈ ప్రదేశం దర్శనానికి 45 నిమిషాల నుండి ఒక గంట సమయం పడుతుంది. చారిత్రాత్మకంగా గొప్ప నేపథ్యం ఉన్న ఈ స్థలాన్ని సందర్శించడానికి ఎప్పుడైనా ఉత్తమ సమయమే. దీనికి సమీప రైల్వే స్టేషన్ కురుక్షేత్ర. రైల్వే స్టేషన్ నుండి, భీష్మ కుండ్ చేరుకోవడానికి 19 నిమిషాలు పడుతుంది. కేవలం 9 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner