శ్రీరాముడిని మనం ఆరాధిస్తాము. శ్రీరాముడు గొప్పతనాన్ని చెప్పుకుపోతే ఎంతో ఉంది. శ్రీరాముని జన్మదినంగా మనం శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాము. ప్రత్యేకించి రాముడిని ఈరోజు ఆరాధిస్తాము. ఈరోజు శ్రీరాముడిని పూజించడం వలన సంతోషం, ధనంతో పాటుగా ఎన్నో లాభాలని పొందవచ్చు.
శ్రీరామ నవమి నాడు శ్రీరామ స్తుతి చదువుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. రాముని అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుడి ఆశీస్సులను కూడా పొందవచ్చు.
ఈ సంవత్సరం అంటే 2025లో రామ నవమి ఎప్పుడు అనే దాని గురించి చూస్తే, చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తేదీ ఏప్రిల్ 05 రాత్రి 07:26 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 06 రాత్రి 07:22 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా, రామ నవమి పండుగ ఆదివారం, 06 ఏప్రిల్ 2025 నాడు ఉదయ తిథిలో జరుపుకుంటారు.
శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణం
నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం (1)
కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరం
వటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరమ్ (2)
భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశనికందనం
రఘునంద ఆనందకంద కౌశల చంద దశరథ నందనం (3)
శిర ముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం
ఆజానుభుజ శరచాపధర సంగ్రామ జిత కరదూషణం (4)
ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనం
మమ హృదయకంజ నివాస కురు కామాదిఖలదలమంజనం (5)
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం