నరక చతుర్దశి నాడు, కన్యారాశితో సహా ఈ 2 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు.. ప్రమోషన్లు, డబ్బు ఇలా ఎన్నో-on naraka chaturdasi 2025 these 2 rasis including kanya rasi receives golden days along with promotions immense wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నరక చతుర్దశి నాడు, కన్యారాశితో సహా ఈ 2 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు.. ప్రమోషన్లు, డబ్బు ఇలా ఎన్నో

నరక చతుర్దశి నాడు, కన్యారాశితో సహా ఈ 2 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు.. ప్రమోషన్లు, డబ్బు ఇలా ఎన్నో

Peddinti Sravya HT Telugu

ఆశ్వయుజ కృష్ణ పక్ష చతుర్దశి నాడు నరక చతుర్దశి వస్తుంది. ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ 19న వచ్చింది. నరక చతుర్దశి నాడు గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది. నరక చతుర్దశి వేళ ఈ రాశులకు అనేక లాభాలు.. మరి ఏ రాశుల వారికి ఈ ఏడాది నరక చతుర్దశి రోజు బాగా కలిసి రాబోతోంది?

నరక చతుర్దశి వేళ ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)

హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో దీపావళి కూడా ఒకటి. దీపావళి నాడు పిల్లలు, పెద్దలు సంతోషంగా దీపాల వెలుగులో పండుగను జరుపుకుంటారు. దీపావళికి ముందు వచ్చే రోజును నరక చతుర్దశి అంటారు. దీపావళికి ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరక చతుర్దశిని “చోటీ దీపావళి” అని కూడా అంటారు.

గ్రహాల సంచారం

ఆశ్వయుజ కృష్ణ పక్ష చతుర్దశి నాడు నరక చతుర్దశి వస్తుంది. ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ 19న వచ్చింది. ఆ రోజున నాలుగు దీపాలను ముఖద్వారం దగ్గర వెలిగించడం వలన మంచి జరుగుతుందని, ప్రతికూల శక్తి నుంచి బయటపడచ్చని నమ్మకం ఉంది. అయితే, నరక చతుర్దశి నాడు గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది.

నరక చతుర్దశి వేళ ఈ రాశులకు అనేక లాభాలు

ఈ గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. గ్రహాలు కాలాన్ని గుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాయి. గురువు అక్టోబర్ 19న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నరక చతుర్దశి వేళ ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి ఈ ఏడాది నరక చతుర్దశి రోజు బాగా కలిసి రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు తెలుసుకుందాం.

1.మిధున రాశి

మిధున రాశి వారికి నరక చతుర్దశి వేళ బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రత్యేకమైన వ్యక్తి జీవితంలోకి వస్తారు. సంతోషం ఎక్కువగా ఉంటుంది.

కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు. సంతానం కలిగి సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది.

2.కన్య రాశి

కన్య రాశి వారికి నరక చతుర్దశి వేళ బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం లభించవచ్చు. మిమ్మల్ని వెతుక్కుంటూ కొత్త అవకాశాలు వస్తాయి. గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు అనేక అవకాశాలు వస్తాయి. సానుకూల మార్పులను చూస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది.

3.మకర రాశి

మకర రాశి వారికి నరక చతుర్దశి నాడు మంచి ఫలితాలు ఎదురవుతాయి. జీతం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సక్సెస్ దిశగా ముందుకు వెళ్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.