Malavya raja yogam: కళలు, అందం, సాహిత్యం, ప్రేమ, ఆకర్షణ, అదృష్టం, ఆనందం, అలంకరణ మొదలైన వాటికి శుక్ర గ్రహం కారకుడిగా పరిగణిస్తారు. మే నెలలో శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు.
మే 18 శనివారం నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ రాశి శుక్రుడు సొంత రాశి. వృషభరాశిలో శుక్రుడు దాని పూర్తి ప్రభావాన్ని చూపిస్తాడు. శుక్రుడి సంచారంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వీటితో పాటు దేవగురువు బృహస్పతి కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో గురు, శుక్ర కలయిక జరుగుతుంది.
ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం అందరిపై ప్రభావం చూపుతుంది. అది మాత్రమే కాదు సుమారు 24 ఏళ్ల తర్వాత ఇవి రెండు గ్రహాలు ఒకే సారి అస్తంగత్వ దశలోకి వెళ్ళాయి. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉండే శుక్రుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. శుక్రుడు జూన్ 12 వరకు వృషభ రాశి లోనే ఉంటాడు. శుక్రుడి పరివర్తన ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో చూద్దాం.
శుక్రుడు మేష రాశి సంపద ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా సంపద పెరుగుతుంది. వాక్కు, వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. రోజువారి ఆదాయం పెరుగుతుంది. భాగస్వామి చర్యల నుండి లాభం పొందుతారు. ప్రేమ సంబంధాల్లో సానుకూల పురోగతి ఉంటుంది.
వృషభ రాశి లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మనోధైర్యంతో సానుకూల పురోగతి, ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఆనందం పెరిగి మానసిక స్థితి మెరుగుపడుతుంది. భౌతిక వనరులు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి ప్రయోజనాలు పొందుతారు. సృజనాత్మకత పెరగడంతో రోజువారి ఆదాయం పెరుగుతుంది. సన్నిహితమైన వ్యక్తి నుంచి ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలు, ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి ఖర్చుల గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. ఫలితంగా ఆనందం, విలాసాలు, సంపద పెరుగుదల, ప్రయాణంలో ఆహ్లాదకర అనుభూతి కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. మేధో సామర్థ్యంతో డబ్బు పొందే అవకాశాలు కూడా ఏర్పడతాయి.
కర్కాటక రాశి లాభదాయకమైన గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. ఫలితంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు, పూర్వికులు ఆస్తి వస్తే చేతికి అందుతుంది. కళాత్మకత పెరుగుతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. సంతోష వనరులు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ, వాహన సౌఖ్యం పెరుగుతుంది. మనసులో సానుకూల భావాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాల్లో సానుకూల పురోగతి ఉంటుంది.
సింహ రాశి రాజ్య గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. ఫలితంగా గౌరవం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధ్యమవుతుంది. సామాజిక ప్రతిష్ట పెరగడంతో మీరు సంతోషంగా ఉంటారు. తోబుట్టువులు, స్నేహితుల కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆనంద వనరులు పెరగడంతో పాటు గృహ వాహన సుఖాలు పెరుగుతాయి. కార్యాలయంలో చేపట్టిన పనులకు ప్రశంసలు లభిస్తాయి.