Karthika Pournami: జాగ్రత్త! కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
Karthika Pournami: కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి హిందూ పురాణంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో నోములు, వత్రాలు చేయడంతో పాటు చాలా మంది మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం అరిష్టంగా చెబుతారు.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజున ప్రత్యేక పూజలు, వత్రాలు, నోములను ఆచరించడం వల్ల సకల దేవుళ్ల ఆశీర్వాదాలు అందుతాయని భక్తుల నమ్మిక. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తీరని కోరికలు కూడా తీరతాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 15న వస్తుంది.
మత విశ్వాసాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి రోజున, శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, దేవతలను అతని దురాగతాల నుండి విముక్తి చేసాడు. ఈ కారణంగా దేవతలందరూ కలిసి సంతోషంతో దీపాలు వెలిగిస్తారు. ఈరోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు దీపాలు వెలిగించడం, దీపం దానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్నిపురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించని వాళ్ళు పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. నారాయణుడు, శివుడిని కలిసి పూజించడానికి కూడా ఇది ప్రత్యేక రోజుగా చెబుతుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అరిష్టం కలిగే ప్రమాదముంది. ఈ రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి?
- కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి.
- కార్తీక పౌర్ణమి రోజున విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.
- కార్తీక పౌర్ణమి రోజున నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి.
- ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.
- కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
- ఈ రోజున ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు.
- కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు వంటి వాటిని దానం చేయడం శుభఫలితాలను అందిస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు?
- కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు.
- ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు లేదా లైట్లు వెలుగుతూను ఉంటారు.
- కార్తీక పౌర్ణమి రోజున మాంసాహరం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు.
- ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించడం, అసభ్య పదజాలం వాడటం మానుకోవాలి.
- ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, బిక్షగాళ్లను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధ్యాన్యాన్ని దానం చేయడం శుభప్రదం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్