బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. బుధుడి రాశి మార్పు మొత్తం 12 రాశులపై సానుకూల-ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. బుధుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు.
పంచాంగం ప్రకారం, జూన్ 6వ తేదీన బుధుడు మిధున రాశిలో సంచరిస్తాడు. మిధున రాశి అధిపతి బుధుడే. కాబట్టి, బుధుని మిధున రాశిలో సంచారం వల్ల ఏ రాశులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
బుధుని మిధున రాశిలో సంచారం వల్ల మిధున రాశి వారికి లాభం ఉంటుంది. న్యాయ సంబంధిత విషయాల్లో విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులకు మంచి వార్తలు అందుతాయి. రియల్ ఎస్టేట్ లో చేసిన పెట్టుబడులు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. పనిమీద ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మేష రాశి వారికి బుధుని మిధున రాశిలో సంచారం శుభప్రదంగా ఉంటుంది. కుటుంబం, పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. బుధుని అనుగ్రహం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
సింహ రాశి వారికి బుధుని మిధున రాశిలో సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ధన సంపద పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం గురించి మంచి వార్తలు వినవచ్చు. వ్యాపారస్తులకు ఇది చాలా శుభకరమైన రోజు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.