జూన్ 29న కుజుడు, చంద్రుడు సంయోగం చెందుతారు. ఇప్పటికి కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా జూన్ 29న సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అటువంటి పరిస్థితిలో సింహరాశిలో చంద్రుడు, కుజుడు కలయిక ఏర్పడుతోంది.
ఈ కలయిక జూలై 1 వరకు ఉంటుంది. జూన్ 29 నుండి జూలై 1 వరకు, చంద్రుడు ఈ రాశిలో ఉంటాడు. చంద్రుడు, కుజుడు కలయిక కొన్ని రాశులపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
సింహ రాశిలో కుజుడు చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. అందువల్ల, కొన్ని రాశులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుందని తెలుస్తోంది. అదే సమయంలో, ఈ యోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వృషభం, కన్యా, మకర, వృశ్చికం, మీన రాశిలో జన్మించిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
అలాంటి వారు ఈ కలయిక వల్ల ప్రయోజనం పొందుతారు.ఇది కాకుండా మీ జాతకంలోని పదవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది,అప్పుడు మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు మరియు వ్యాపారంలో విజయం పొందుతారు. ఈ కలయిక వల్ల ఏయే రాశుల వారు ప్రభావితమవుతారో ఇక్కడ తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో మంచి జరుగుతుంది.
ఈ రాశి వారు ఈ సమయంలో ఎప్పటి నుంచో రాని డబ్బును తిరిగి పొందవచ్చు, ఈ సమయంలో మీకు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. సమస్యలు తీరుతాయి.
వృశ్చిక రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. రెండు చోట్ల నుంచి డబ్బులు వస్తాయో. కాబట్టి మీ ఆదాయం కోసం శ్రమిస్తూ ఉండండి.
వ్యాపారం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా, ఈ శుభ యోగంతో లాభాలను పొందుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.