జూలై 26న గురు, శుక్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి ఐశ్వర్యం, అదృష్టం, అందమైన ప్రేమ జీవితం ఇలా ఎన్నో!-on july 26th jupiter venus conjunction forms gaja lakshmi raja yoga these 3 rasis will get immense wealth luck and more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూలై 26న గురు, శుక్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి ఐశ్వర్యం, అదృష్టం, అందమైన ప్రేమ జీవితం ఇలా ఎన్నో!

జూలై 26న గురు, శుక్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి ఐశ్వర్యం, అదృష్టం, అందమైన ప్రేమ జీవితం ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జూలై నెలాఖరులో ఏర్పడే ఈ యోగం ఆగస్టు వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. ఆగస్టు ప్రారంభంలో, మిథున రాశిలో గురువు, శుక్రుడి కలయిక గజలక్ష్మి రాజ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఆగస్టు 20 వరకు ఉంటుంది.

జూలై 26న గురు, శుక్రుల కలయిక

జూలై 26న శుక్రుడు మిథున రాశిలో గురువు సంయోగం చెందుతాడు. శుక్రుడి రాశి మార్పు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. మీ జీవితంలో ప్రేమ, అందం, సౌభాగ్యంలో ఏదైనా మార్పు వచ్చిందంటే దానికి కారణం శుక్రుడు. శుక్రుడు జూలై 26న కర్కాటక రాశి నుండి మిథునంలోకి ప్రవేశిస్తాడు, ఇప్పటికే గురువు ఈ రాశిలో ఉన్నాడు. శుక్రుడి మార్పు వల్ల ఏయే రాశుల వారు ప్రభావితమవుతారో తెలుసుకుందాం.

జూలై నెలాఖరులో ఏర్పడే ఈ యోగం ఆగస్టు వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. ఆగస్టు ప్రారంభంలో, మిథున రాశిలో గురువు, శుక్రుడి కలయిక గజలక్ష్మి రాజ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఆగస్టు 20 వరకు ఉంటుంది. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ యోగంలో ఏయే రాశుల వారికి అదృష్టం లభిస్తుందో తెలుసుకుందాం.

మిథున రాశిలో గురు, శుక్రుల కలయికతో గ సంచారంతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.మిథున రాశి

శుక్రుడి మార్పు మిథున రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను తీసుకు వస్తుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో లాభాలు పొందుతారు. పురోగతి ఉంటుంది, కానీ కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు మరింత బలపడతారు, శుక్రుడి అనుగ్రహం మీ రాశిపై ఉంటుంది. మీకు ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంతో సంతోషంగా వుంటారు. కెరీర్ లో కూడా ఉద్యోగం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

3.తులా రాశి

తులా రాశి వారికి శుక్రుడు, గురువు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కలయిక వల్ల మీరు వృత్తి జీవితంలో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో అన్ని సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.