గ్రహాలు కాలాలను గుణంగా ఒక రాశి నుంచి మరో రాశులకు ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. శని కూడా ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం. శని న్యాయ దేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు ఇస్తాడు.
శని తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్ 20న శని దేవుడు శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తాడు. శని ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. అయితే దీపావళికి కూడా శని మీన రాశిలో తిరోగమనంలో ఉండడం, కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకు రానుంది. కార్లు, ఆస్తులు లభిస్తాయి. ఎక్కువ ఆదాయం ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు. మరి ఏ రాశుల వారికి దీపావళి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి వారికి మీనరాశిలో శని తిరోగమనం బాగా కలిసి వస్తుంది. దీపావళికి ఈ రాశి వారు శని నుంచి మంచి ఫలితాలను పొందుతారు. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్త ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించవచ్చు. ఇనుము, నూనె మొదలైన నల్లటి వస్తువులను అమ్మే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఎక్కువ ఆదాయం ఉంటుంది.
వృషభ రాశి వారికి కూడా దీపావళికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులు ఉంటాయి.
మకర రాశి వారికి శని కారణంగా శుభఫలితాలు ఎదురవుతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కార్లు, ఆస్తులు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
కుంభ రాశి వారికి కూడా శని తిరోగమనం బాగా కలిసి వస్తుంది. దీపావళికి ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
గమనిక: ఇవి జ్యోతిష శాస్త్ర అంచనాలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి.