Maha shivaratri naivedyam: శివరాత్రి రోజు ఈ నైవేద్యాలు సమర్పించండి.. శివయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది
Maha shivaratri naivedyam: మహా శివరాత్రి శివయ్య ఆశీర్వాదాలు పొందేందుకు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించండి. ఆ మహా దేవుడు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతాడు.
Maha shivaratri naivedyam: మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులను పూజించడం వల్ల జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున శివలింగానికి బిల్వపత్రం, ఉమ్మెత్త పువ్వు, తెల్ల చందనం, తెలుపు రంగు పూలు, గంగా జలం, ఆవు పాలు వంటి వాటితో శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం చేస్తారు. ఇవన్నీ చేయడానికి వీలు లేకపోతే కేవలం మంచి నీళ్లు బిల్వపత్రం సమర్పించిన చాలు మహా దేవుడు కరిగిపోతాడు. శివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఈ ప్రత్యేక నైవేద్యాలు సమర్పించండి.
తండై
శంకరుడికి మహా శివరాత్రి రోజు భంగ్ తండై సమర్పించండి. ఇది మహా శివుడికి అత్యంత ప్రీతిప్రాతమైనదని నమ్ముతారు. భంగ్ సమర్పించడం వల్ల శివుడు చాలా సంతోషిస్తాడని భక్తుల విశ్వాసం. శివుడికి భంగ్ అంటే ప్రీతి కలగడం వెనుక ఇక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు చిన్నతనంలో ఒకసారి ఇంట్లో తిట్టారని అలిగి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చుండిపోతాడు. ఆ సమయంలో ఆకలిగా అనిపించి ఆ చెట్టు ఆకులు తిన్నాడు. అవి మరేవో కాదు భంగ్ చెట్టు ఆకులు. అప్పటి నుంచి శివుడికి భంగ్ అంటే మహా ఇష్టం.
లస్సి
భోళా శంకరుడికి లస్సీ అంటే మహాప్రీతి. తండైతో పాటు మీరు లస్సీ కూడా మహా శివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ చేసిన తర్వాత మీరు దీన్ని ప్రసారంగా స్వీకరించి ఇతరులతో కూడా పంచుకోవచ్చు.
హల్వా
పవిత్రమైన రోజున మహా శివుడికి డ్రై ఫ్రూట్స్ తో చేసిన హల్వా సమర్పించండి. ఇది సమర్పించడం వల్ల శివుడు సంతోషించి ఆయన కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడు. జీవితం సంతోషంతో నిండిపోతుంది.
మాల్పువా
శివశంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మాల్పువా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంట్లోనే మాల్పువా చేసుకుంటున్నట్లయితే అందులో కొద్దిగా భంగ్ పౌడర్ వేసుకోవచ్చు.
పంచామృతం
పంచామృతం లేకుండా శివ పూజ పూర్తి కాదు. ఐదు రకాల పదార్థాలతో చేసే ఈ పదార్థం అమృతంలాగా ఉంటుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, నెయ్యి, తేనె కలిపి పంచామృతాన్ని తయారు చేస్తారు. ఇది స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయొచ్చు.
ఖీర్
ప్రతి పండక్కి తప్పనిసరిగా ఖీర్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మహాశివరాత్రి రోజున మీరు ఖీర్ కూడా తయారుచేసి స్వామి వారికి సమర్పించవచ్చు. డ్రై ఫ్రూట్స్ పాలతో ఖీర్ సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.
సగ్గుబియ్యం కిచిడి
శివరాత్రి రోజు అందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ సబుదానా కిచిడీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఉపవాసం విరమించిన తర్వాత తినేందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సగ్గుబియ్యంతో చేసే ఈ కిచిడి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థము కూడా పోషక విలువల కలిగి ఉంటుంది.
శ్రీఖండ్
పెరుగుతో తయారు చేసే ఈ పదార్థం చాలా రుచికరంగా ఉంటుంది. పెరుగుని ఒక వస్త్రంలో వేసి నీళ్ళు వడకట్టుకోవాలి. ఆ పెరుగులో కుంకుమపువ్వు, యాలకుల పొడి, చక్కెర, పాలు కలిపి బాగా మెత్తగా క్రీమ్ మాదిరిగా కలుపుకోవాలి. మహాశివరాత్రికి అద్భుతమైన నైవేద్యంగా ఇది ఉంటుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం.