ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనునిత్యం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కోజాగరి లక్ష్మీ పూజ చేయడం మంచిది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రాత్రి ఈ పూజ చేయాలి.
దీనిని శరత్ పౌర్ణిమ అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో దీనిని ఘనంగా జరుపుతారు. ఆ రోజు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కోజాగరి లక్ష్మీ పూజ ఈసారి ఎప్పుడు వస్తుంది? తేదీ, పూజ సమయంతో పాటు పూజ విధానం గురించి కూడా తెలుసుకుందాం.
కోజాగరి లక్ష్మీ పూజను శరత్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ పౌర్ణిమ తిథి సోమవారం, అక్టోబర్ 6న మధ్యాహ్నం 1:23కి ప్రారంభమవుతుంది. మంగళవారం, అక్టోబర్ 7 ఉదయం 9:16తో ముగుస్తుంది. అమ్మవారిని రాత్రి 11:45 నుంచి 12:34 మధ్య ఆరాదించవచ్చు. లేదంటే సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఆరాదించవచ్చు.
‘కౌముది’ అంటే వెన్నెల అని అర్థం. ఈ వ్రతాన్ని అక్టోబర్ 6, సోమవారం జరపాలి. ప్రత్యేకించి సోమవారం సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని పూజిస్తున్న ఫోటోను పెట్టి ఆరాధించండి. అదే విధంగా అమ్మవారికి తెల్లటి పూలను కూడా సమర్పించండి.
“ఓం శ్రీం శ్రీయై నమః” అనే మంత్రాన్ని జపించండి. ఇలా ఈ మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.