న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందనేది చెప్పడమే కాక, ఒక మనిషి యొక్క భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఎలాంటి విషయాల్లో కలిసి వస్తుందన్న విషయాలను తెలుసుకోవచ్చు.
ప్రతి ఒక్క మనిషి ఆలోచన వేరుగా ఉంటుంది. కొంతమంది స్వతంత్రంగా, ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. కొంతమంది అందరితో సరదాగా గడపాలని, అందరితో కలిసిపోయి ఉండాలని అనుకుంటారు.
మన జీవితంలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవితంలో పైకి రావడానికి కుటుంబం ఎంతో సహాయపడుతుంది. వారు మనకు తోడుగా నిలుస్తారు. చాలామంది చిన్నప్పటి నుండే కుటుంబంపై ఆధారపడిపోతారు. ఒకసారి పెద్దయ్యాక, ఉద్యోగం వచ్చిన తర్వాత వారిని కనీసం పట్టించుకోరు. కొంతమంది మాత్రం తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచిస్తారు. అంతే కాదు ఈ తేదీల్లో పుట్టిన వారికి కుటుంబమే ప్రాణం. మరి వారిలో మీరూ ఒకరేమో చూడండి.
ఏదైనా నెలలో 3, 12, 21 తేదీల్లో పుట్టినట్లయితే, వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతుంది. వీరు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రతి నిమిషం కుటుంబం గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులు ఏదైనా సమస్యలో ఉన్నా, ఆలోచనలో ఉన్నా, వీరు అన్నింటినీ కరెక్ట్‌గా చెబుతారు. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు.
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు, వారి రేడిక్స్ నెంబర్ 9 అవుతుంది. వీరు కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరికైనా సమస్యలు ఉంటే, దానిని తీర్చడానికి ముందుంటారు. ఈ తేదీల్లో పుట్టినవారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలుస్తారు.
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే, వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ముందుండి ఆ సమస్యను తొలగిస్తారు. ఎప్పుడూ కూడా సమస్య వస్తే తప్పించుకోవడం, పారిపోవడం లాంటి వాటిని చేయరు. ఎల్లప్పుడూ కుటుంబానికి సపోర్ట్‌గా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్