న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఏ రంగంలో కలిసి వస్తుంది, ఎటువంటి కెరియర్ లో సక్సెస్ ని అవ్వచ్చు అనేది కూడా చెప్పవచ్చు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఏదైనా నెలలో 1,10,19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు. ఉన్నత చదువులు చదువుకుంటారు. పరిశోధనకు సంబంధించిన వాటిలో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కడికి వెళ్ళినా అందరూ వీరిని గౌరవిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉండడంతో కెరియర్ లో దూసుకుపోతారు. మెడికల్ కి సంబంధించిన ఫీల్డ్ లో కూడా వీరికి కలిసి వస్తుంది.
ఈ తేదీల్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఉంటారు. వారికి నచ్చినట్లుగా వారి జీవిస్తారు. ఇతరుల సలహాలు కూడా తీసుకోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరి మీద ఆధారపడడం కూడా ఇష్టం ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వీరికి ఎక్కువ.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా రిలేషన్షిప్ లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వీరి గుండె రాయి లాంటిది. దీనితో ఎక్కువగా రిలేషన్ షిప్ లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్