న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలని చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందని చెప్పడం తో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేదీ కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీలో సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రాడిక్స్ నంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. వీటి ఆధారంగా ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎవరు ఎలా ఉంటారో అనేది చెప్పవచ్చు.
నిజానికి రాడిక్స్ అనేది న్యూమరాలజీలో చాలా ముఖ్యమైనది. ప్రతీ సంఖ్యకు ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపించే గ్రహం ఉంటుంది. ఈరోజు రాడిక్స్ నంబర్ 7 కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ సంఖ్యకు అధిపతి కేతువు.
రాడిక్స్ నంబర్ 7 వారు ఎప్పుడూ కూడా మనసు చెప్పిన దాని ప్రకారం నిర్ణయాలను తీసుకుంటారు. మెదడు చెప్పేదే దానిని బట్టి నిర్ణయం తీసుకోరు. ఇతరులను బాగా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు. ఎమోషన్స్ వలన అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది.
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నంబర్ 7 అవుతుంది. మరి ఈరోజు ఈ సంఖ్యకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
రాడిక్స్ నంబర్ 7 వారి హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా వీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనితో ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఈ సంఖ్య వారు జీవిత భాగస్వామి భావాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు. వీరి మాటలు కూడా మధురంగా ఉంటాయి. దీని ద్వారా మంచి సంబంధాలను కొనసాగిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్