ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు, నిజాయతీగా ఉంటారు!-numerology says people who born in these dates falls love in first sight and very honest in relationship check now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు, నిజాయతీగా ఉంటారు!

ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు, నిజాయతీగా ఉంటారు!

Peddinti Sravya HT Telugu

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, వారి బలాలు–బలహీనతలు ఇలా అనేక విషయాలను చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు (pinterest)

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, వారి బలాలు–బలహీనతలు ఇలా అనేక విషయాలను చెప్పవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు అంత ఈజీగా ప్రేమించడానికి ఒప్పుకోరు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం చూసినా మరుక్షణమే ప్రేమలో పడిపోతారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు త్వరగా ప్రేమలో పడిపోతారో ఇప్పుడు తెలుసుకోండి.

రాడిక్స్ నెంబర్ 5

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 వారు సులువుగా ప్రేమలో పడిపోతారు. త్వరగా ప్రేమలో పడిపోయి తర్వాత ఒక్కోసారి బాధపడుతూ ఉంటారు కూడా. మొదటి చూపుకే ప్రేమలో పడిపోవడం వీరికి అలవాటు. దీని కారణంగానే తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు.

బుధుడు అధిపతి

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. తెలివితేటలు, జ్ఞాపకశక్తి మొదలైన వాటికి కారకుడు.

నిజాయితీగా ఉంటారు

రాడిక్స్ నెంబర్ 5 వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. అంత కుదురుగా ఒక చోట పని చేసుకోలేరు, ఒక దగ్గర సరిగ్గా కూర్చోలేరు కూడా. దీంతో ఒక్కోసారి అవకాశాలను కోల్పోతూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ప్రేమ విషయంలో రాడిక్స్ నెంబర్ 5 కు చెందిన వారు నిజాయితీగా ఉంటారు. దీంతో తర్వాత బాధపడాల్సి వస్తుంది.

త్వరగా సక్సెస్ అవుతారు

అదే విధంగా ఈ తేదీల్లో పుట్టిన వారు త్వరగా అందర్నీ నమ్మేస్తూ ఉంటారు, అందరితో స్నేహం చేసేస్తారు. అది కూడా వారికి పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సహనంతో, ఫోకస్ పెట్టి కెరీర్‌పై దృష్టి పెట్టారంటే త్వరగా సక్సెస్ అవుతారు. వారికి ఉన్న పదునైన జ్ఞాపకశక్తితో అన్ని ఈజీగా సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.